Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ రియాలిటీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. విదేశాల్లో బిగ్ బ్రదర్ గా ప్రసారమైన ఈ షో, ఇండియాలో బిగ్ బాస్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. హిందీలో గ్రాండ్ సక్సెస్ కావడంతో అన్ని ప్రధాన రీజనల్ భాషల్లో బిగ్ బాస్ షో అందుబాటులోకి వచ్చింది. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ కి టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా ఉన్నారు. శివ బాలాజీ టైటిల్ విన్నర్ అయ్యారు. నెక్స్ట్ సీజన్ నుండి సినిమాల కారణంగా ఎన్టీఆర్ తప్పుకున్నారు.
ఎన్టీఆర్ స్థానంలో నాని వచ్చారు. ఆయన హోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. అందుకే నాని కూడా నెక్స్ట్ సీజన్ చేయనన్నారు. దాంతో మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో టాలెంటెడ్ హోస్ట్ గా పేరు తెచ్చుకున్న నాగార్జునను లైన్లోకి తెచ్చారు. సీజన్ 3 నుండి ఆయనే హోస్ట్ గా ఉన్నారు. సీజన్ 7కి హోస్ట్ మారుతాడనే ప్రచారం జరిగింది
బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ప్లాప్. కనీస ఆదరణకు నోచుకోలేదు. ముఖ్యంగా నాగార్జున హోస్టింగ్ విమర్శల పాలైంది. ఆయన షో చూడకుండానే కంటెస్టెంట్స్ రివ్యూ చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. కొందరి విషయంలో సాఫ్ట్ గా వ్యవహరించిన నాగార్జున మరికొందరి గట్టిగా టార్గెట్ చేశాడనిపించింది. దాంతో పాటు అవే పాత గేమ్స్, కాన్సెప్ట్స్ కిక్ ఇవ్వలేదు. ఎలిమినేషన్స్ సైతం ఓట్ల ఆధారంగా జరగలేదని అపవాదు మోశారు.
బిగ్ బాస్ సీజన్ 7కి నాగార్జున హోస్ట్ కాదని జనాలు ఫిక్స్ అయ్యారు. కానీ ఆయనే మళ్ళీ రంగంలోకి దిగాడు. నాగార్జునతో కూడిన ప్రోమో వచ్చేసింది. ఈసారి అంతా ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటున్నారు. ఈ తికమక కాన్సెప్ట్ ఏమిటో చూడాలి. కాబట్టి సీజన్ 7 కి కూడా నాగార్జునే హోస్ట్. ఈసారి ఆయన గత మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కొంచెం పేరున్న, ముక్కు మొహం తెలిసిన సెలబ్రిటీలను ఎంపిక చేశారని సమాచారం. ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యే అవకాశం కలదు. జులై చివరి వారం కూడా కావచ్చంటున్నారు. సీజన్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్ టైటిల్ అందుకున్నారు. ఫైనల్ లో శ్రీహాన్ డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకోవడంతో రేవంత్ విజేతగా నిలిచాడు.
Everything you think you know about Bigg Boss is about to be revolutionized! Are you ready for this season, with your most favorite @iamnagarjuna ?! Confused? Excited? Stay tuned to find out more about #BiggBossTelugu7 pic.twitter.com/tvlpNtD1qt
— Starmaa (@StarMaa) July 18, 2023