https://oktelugu.com/

OTT Movie: ప్రేమలో పడిన యంగ్ గర్ల్స్, ఘాటైన రొమాన్స్… ఓటీటీని ఊపేస్తున్న మూవీ, ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడాలి!

OTT Movie: విదేశాల్లో అలాంటి పరిమితులు ఉండవు. కంటెంట్ పై విమర్శల దాడి కూడా తక్కువే. కాబట్టి క్రియేటివిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కాగా ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ ఓటీటీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ మూవీ ఏమిటో? ఎక్కడ చుడొచ్చో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : July 10, 2024 / 05:11 PM IST

    Two Young girls relationship romantic movie

    Follow us on

    OTT Movie: ఓటీటీ వచ్చాక విలక్షణ కంటెంట్ ప్రేక్షుకులు ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ అంతర్జాతీయ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పాప్యులర్, సినిమాలు సిరీస్లు అందుబాటులోకి తెస్తున్నాయి. సినిమా ప్రేమికులకు సమయం ఉండాలంటే కానీ… అన్ లిమిటెడ్ కంటెంట్ వారి సొంతం. ఓ తరహా చిత్రాలు ఇండియన్ మేకర్స్ తెరకెక్కించరు. ముఖ్యంగా ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ చేస్తూ సినిమా లేదా సిరీస్ చేయాలంటే సంశయిస్తారు.

    విదేశాల్లో అలాంటి పరిమితులు ఉండవు. కంటెంట్ పై విమర్శల దాడి కూడా తక్కువే. కాబట్టి క్రియేటివిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కాగా ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ ఓటీటీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ మూవీ ఏమిటో? ఎక్కడ చుడొచ్చో చూద్దాం. 2018 లో విడుదలైంది డక్ బట్టర్. ఈ చిత్రానికి మిగ్యుల్ ఆర్టెటా దర్శకుడు. అమెరికన్ ఇండిపెండెంట్ మూవీగా తెరకెక్కింది.

    ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఇద్దరు యంగ్ గర్ల్స్ ప్రేమలో పడతారు. వారిద్దరి మధ్య ఘాటైన రొమాంటింగ్ సన్నివేశాలు ఉంటాయి. ఇది కుటుంబంతో పాటు చూడలేం. కేవలం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయాల్సిన చిత్రం. ఇండియాలో అతి తక్కువ లెస్బియన్ లవ్ స్టోరీస్ తెరకెక్కాయి. డక్ బట్టర్ మూవీలో అలియా షాకత్, లైలా కోస్టా ప్రధాన పాత్రలు చేశారు.

    డక్ బట్టర్ మూవీ కథ విషయానికి వస్తే… సెర్గియో(లైలా కోస్టా) పబ్ లో సింగర్. నిమా(అలియా షాకత్) క్రియేట్ ఫీల్డ్ లో ఉంటుంది. ఓ రోజు పబ్ కి వెళ్లిన నిమా కి సెర్గియా పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోతారు. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆ మనస్పర్థలు ఎందుకు వచ్చాయి? వారు తిరిగి మళ్ళీ కలిశారా? వారి బంధం ఎలా ముగిసింది? అనేది కథ. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.