Homeఎంటర్టైన్మెంట్Guinnes Record: గిన్నిస్ బుక్​లో స్థానం దక్కించుకున్న ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్​

Guinnes Record: గిన్నిస్ బుక్​లో స్థానం దక్కించుకున్న ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్​

Guinnes Record: ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్​ రాధిక అరుదైన ఘనత సాధించారు. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​లో చోటు దక్కించుకున్నారు. ఏఎంఎస్​ ఫైన్​ ఆర్ట్స్​ సంస్థ నిర్వహకులు, సమాజ సేవకులు డాక్టర్ ఆర్​.జె. రామనారాయణన్​ నాట్యకళలను ప్రోత్సహించే విధంగా వాటిపై అవగాహన కలిగించేలా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాగా, సినిమా నృత్య దర్శకత్వంలో రాధిక బృందం చెన్నైలోని పలు వేదికలపై ప్రదర్శన ఇస్తుండేవారు. దాతో పాటు ఆన్​లైన్ ద్వారా కూడా రోజూ గంట చొప్పున 365 రోజులు నాట్యకళ వేడుకలను నిర్వహిస్తున్నారు.

choreograper-radhika-guinness-record

ఈ క్రమంలోనే నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా, చివరిరోజు 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్యకళా కార్యక్రమం గిన్నిస్​ బుక్​లో నమౌదైంది. న్యాయమూర్తుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్​ రికార్డ్ బుక్ నిర్వహకులు ఆన్​లైన్​ ద్వారా డాన్స్​ను తిలకించారు.

ఈ కార్యక్రమానికి పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నాట్య కళాకారులను అభినందిస్తూ.. గిన్నిస్ రికార్డు సాధించిన నృత్య దర్శకురాలు రాధికను సత్కరించారు. సిని పరిశ్రమలోనే కాకుండా.. నాట్యకళకు ఆమె చేసిన కృషి అభినందనీయమని అందరూ కొనియాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version