Suriya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు పాన్ ఇండియాలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు మాత్రం పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధించడంలో వెనకడుగు వేస్తున్నారు. ఏ పెద్ద సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియాలో సక్సెస్ అయితే సాధించలేకపోవడం ఒకరంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు సూర్య… ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడ కూడా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ముఖ్యంగా గజినీ(Gajini) సినిమా ఇక్కడ సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా 2005వ సంవత్సరంలో రిలీజ్ అయిన తెలుగు సినిమాలతో పోటీపడి మరి ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక దాంతో ఇక్కడున్న జనాలందరు సూర్య ని కూడా మన తెలుగు హీరోలానే భావించి ఆయన చేస్తున్న సినిమాలన్నింటిని ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య కోసం ఇద్దరు దర్శకులు ఎదురుచూస్తున్నారు. అందులో ఒకరు చందు మొండేటి(Chandu Moondeti) కాగా మరొకరు వెంకీ అట్లూరి…రీసెంట్ గా చందు మొండేటి తండేల్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక ‘కార్తీకేయ 2’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నప్పుడే చందు సూర్యకి ఒక కథను వినిపించారట. అయితే ఆ కథ బాగా నచ్చడంతో సూర్య ఈ కథని మనమే చేద్దామని ఫైనల్ చేశాడు.
కానీ అనుకోకుండా చందు మొండేటి తండేల్ సినిమా చేయడంతో దానికి కొద్దిరోజులు బ్రేకులు పడ్డాయి. మరి ఇప్పుడు అదే కథను సెట్స్ మీదకి తీసుకురావాలనే ఉద్దేశ్యంలో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి (Venky Atluri) సైతం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమా సక్సెస్ అయిన తర్వాత సూర్యకి ఒక కథను వినిపించాడు.
ఆ కథ కూడా అద్భుతంగా ఉండడంతో ఆ సినిమాని చేయాలని సూర్య కమిట్ అవుతున్నాడు. ఇందులో ఏ దర్శకుడికి సూర్య మొదటి ఓటు వేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళతో పాటుగా చందు మొండేటి కోసం గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ ముందుకు వచ్చి సూర్య డేట్స్ బుక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే వెంకి అట్లూరి కోసం సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అయిన నాగ వంశీ సూర్య డేట్స్ ని పట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక వీళ్లిద్దరిలో ఆయన ఎవరి తో సినిమా చేస్తాడు. ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ ఇద్దరిలో ఏ డైరెక్టర్ తో సూర్య సినిమా చేస్తాడు అనేది పక్కన పెడితే మొత్తానికైతే తెలుగులో సూర్య సినిమా చేస్తున్నాడు అనే సంతోషంలో ఆయన అభిమానులు ఉండటం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి…