Tollywood: మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇందుకు గాను నిర్మాతలు కూడా తగ్గడం లేదు అనే చెప్పాలి. సినిమా క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఒకే నిర్మాణ సంస్థ కాకుండా రెండు, మూడు కలిసి భారీ చిత్రాలనూన్ రూపొందించడం … చిన్న సినిమాల నైనా తెరకెక్కిస్తుండడం చూస్తూనే ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాను మూడు సంస్థలు నిర్మించి లాభాలు అందుకున్నాయి.
ఈ బాటలోనే యూవీ, గీతా ఆర్ట్స్ సంస్థలు కొంతకాలంగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో రెండు సంస్థలు చేరాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా సినిమాలను నిర్మించేందుకు రెడీ అయ్యాయి. సునీల్ నారంగ్, రామ్మోహన్, అగర్వాల్ కలిసి సంయుక్తంగా సినిమాలు చెఃయనున్నట్లు తెలుస్తుంది.
https://twitter.com/baraju_SuperHit/status/1454337553071443974?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454337553071443974%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2Ftelugunews%2Fabhiskek-agarwal-arts-sri-venkateswara-cinemas-join-hands-together-krkk-mrgs-chitrajyothy-192110310318522
ఈ మేరకు తాజాగా ‘మా రెండు సంస్థల నుంచి విడివిడిగా స్టార్ హీరోలతోనూ, కొత్త వాళ్ళతోనూ పలు విజయవంతమైన చిత్రాలొచ్చాయి. వివిధ జోనర్స్ లో కథలు అందించాం. ఇప్పుడు మరింత పటిష్ఠంగా, భారీ ఎత్తున సినిమాలు నిర్మించబోతున్నాం. త్వరలోనే మా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటిస్తాం’ అని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. అందుకు గాను సోషల్ మీడియా వేదికగా ఓ వీడియొ ను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఓ అగ్ర కథానాయకుడు హీరోగా సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ మూవీకి సంబంధించి త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారని సమాచారం.