Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. దేశ, విదేశాల్లో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ… ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. అయితే తాజాగా ఓ కొత్త గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు చిరు. దెయ్యం లుక్‌లో చిరంజీవి ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ లుక్ మూవీకి సంబంధించి కాదు.

హలోవీన్ డే సంధర్భంగా పలువురు వారి వారి రీతిలో విభిన్న గెటప్స్ లో కనిపించడం తెలిసిన విషయమే. ఈ మేరకే చిరంజీవి ఘోస్ట్ గెటప్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు మెగాస్టార్. ఈ సంధర్భంగా ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ కూడా తెలిపారు. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదని… ఓ యాప్ ఉపయోగించి ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/Deepu0124/status/1454705809363902464?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454705809363902464%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fvideo-megastar-chiranjeevi-gets-an-interesting-halloween-makeover-but-with-a-twist-569124.html
ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే… కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. వచె ఏడాది ఫిబ్రవరి 4 న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా… మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ త్వరలో పట్టాలెక్కనుంది.