Anchor Anasuya Bharadwaj: ప్రముఖ యాంకర్, సినీనటి అనసూయకు కోపమొచ్చింది. తనను ఆంటీ అని సంబోధించినందుకు ఫైర్ అవుతోంది. తన ఆత్మాభిమానం దెబ్బతిందని అసహనం వ్యక్తం చేస్తోంది. తన ప్రతిష్ట, గౌరవానికి భంగం కలిగించే పనులు చేస్తే ఉపేక్షించేది లేదని ఘాటుగా స్పందించింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందర్భంలో నటుడు విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను ఆంటీ అని ట్వీట్ చేయడం ఆమెకు నచ్చలేదు. తన వయసు, గౌరవం, ప్రతిష్టలకు భంగం కలిగితే ఎంతటి వారైనా తనకు అవసరం లేదని చెబుతోంది.
ట్విట్టర్ వేదికగా తనను ఆంటీ అని పిలవడంలో ఆంతర్యమేమిటి? తన కెరీర్ కు భంగం కలిగించడమే కానీ వేరే ఉద్దేశాలు ఉంటే తనకు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కెరీర్ కు మచ్చ తెచ్చేవారు ఎంతటి హోదాలో ఉన్నా విడిచిపెట్టనని మందలిస్తోంది. సినిమాలు, టీవీల్లో తనదైన శైలిలో రాణిస్తున్న సమయంలో తన ఉనికికి భంగం కలిగించే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని నిరసన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తూ తనకంటూ ఓ ఆశల సౌధాన్ని నిర్మించుకుంటుంటే ఇలా బదనాం చేయడం బాగా లేదని ఆక్షేపించింది.
విజయ్ దేవరకొండ అభిమానులు చేస్తున్న పనికి అనసూయలో కోపం కట్టలు తెంచుకుంటోంది. వారి ఖాతాలను పరిశీలిస్తానని చెబుతోంది. నన్ను అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోనని సవాల్ చేస్తోంది. దీంతో అనసూయ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అగాధమే ఏర్పడుతోంది. ఈ విషయం చిలికిచిలికి గాలివానలా మారే ప్రమాదం ఏర్పడింది. అభిమానులు చేస్తున్న పనికి తారల దాకా వచ్చింది. ఎవరో చేసిన పొరపాటుకు మరెవరో ఫలితం అనుభవించినట్లు కొంతమంది చేసే పిచ్చి పనులతో అందరికి చెడ్డపేరు రావడం ఖాయమే.
దీంతో ప్రస్తుతం టీకప్పులో తుఫానులా మారిన ఈ వ్యవహారం ఎందాక వెళ్తుందో తెలియడం లేదు. అనసూయ మాత్రం దీన్ని ప్రెస్టేజీగా తీసుకుంటోంది. తనను అవమానించేందుకే ఆంటీ అని పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఈ కథ ఎక్కడ ఆగుతుందో కూడా తెలియడం లేదు. ఎవరో పెట్టిన మంటకు మరెవరో బాధ్యులు కావాల్సిన అవసరం వస్తోంది. దీనిపై అనసూయ మాత్రం తగ్గడం లేదు. తనను అవమానించిన వారిని విడిచిపెట్టేది లేదని చెప్పడం గమనార్హం.
Also Read:Pawan Kalyan : ‘నీ ప్రేమ సల్లగుండ’.. జగన్ కు పవన్ కళ్యాణ్ పంచ్ అదుర్స్