Payal Rajput: ఏ రంగంలో చూసినా పోటీ పెరిగిపోతోంది. ఒక పనికి ఎంతో మంది వస్తుంటారు. పోతుంటారు. కానీ నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందే. ఏదో ఎంట్రీ ఇచ్చాం మాకెందుకులే అనుకోవడానికి లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అయితే మరీ పోటీ. ఎప్పుడు ఎవరు వచ్చి మన స్థానాన్ని కొట్టుకుపోతారో తెలియదు. అందుకే సినిమా పరిశ్రమలో ఎవరిది కూడా పర్మినెంట్ స్థానం కాదు. అలా వస్తుంటారు పోతుంటారు. ఎవరికి వారు తమ టాలెంట్ ను ప్రదర్శించి అవకాశాలు చేజిక్కించుకోవాల్సిందే. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే రాణించగలం. లేదంటే అంతేసంగతి. సినిమా పరిశ్రమలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒక్క అడుగు తడబడినా మన దురదృష్టం వెంటాడటం ఖాయం.

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఉంటుందో అర్థం కావడం లేదు. అంతలా పోటీతత్వం పెరిగిపోయింది. ఫలితంగా అవకాశాలు సన్నగిల్లాయి. పొట్ట చేత పట్టుకుని అందరు సినిమా రంగం వైపు చూస్తున్నా వారి ఆశలు తీరడం లేదు. కొందరికి అవకాశాలు రావడం లేదు. కొందరు వచ్చినా ఉపయోగించుకోవడం లేదు. మరికొందరికి అరకొర వచ్చినా వాటిని ఉపయోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ అంతా గందరగోళంగా మారుతోంది.
ఆ మధ్య ఆర్ఎక్స్ సినిమాలో మెరిసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు అందం అభినయం రెండు ఉన్నాయి. ఆ అమ్మాయి ఇండస్ట్రీని ఊపేస్తుంది అనుకున్నారు. కానీ తరువాత కాలంలో తుస్సు మంది. ఇప్పుడు అవకాశాల కోసం వెంపర్లాడుతోంది. తాజాగా ఈ అమ్మడు ఓ త్యాగం కూడా చేస్తోందని పరిశ్రమ వర్గాల టాక్. ఓ బూత్ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పరిశ్రమలో గుసగుసలు మొదలయ్యాయి. అవకాశాలు లేకపోతే ఏం చేయాలి? ఏదో పొట్టకూటి కోసం అలా చేయాల్సి వస్తోందని కొందరు వాదిస్తున్నారు.

అయితే అందులో ఓ అరగంట న్యూడ్ గా కనిపించేందుకు కూడా ఒప్పుకుందని సమాచారం. ఓ అరగంట కళ్లు మూసుకుంటే అరకోటి వస్తాయని ఆమె ఆశిస్తోంది. దీనికి గాను యాజమాన్యంతో బేరం పెట్టినట్లు సమాచారం. మరి ఏం చేస్తుంది ఆఫర్లు లేక కష్టాల్లో ఉన్న ఆమెకు వెబ్ సిరీస్ ఆదుకుంటోంది. అరగంట కాంప్రమైజ్ అయితే అరకోటి లెక్క కరెక్టే కదా. ఎంత కష్టపడితే రావాలి అంత డబ్బు. అందుకే ఆమె తన అందాలను అమ్ముకుని సంపాదించుకోవాలని చూస్తోంది. అందులో తప్పేముందని పరిశ్రమ వర్గాల ఉవాచ.
పాయల్ లెక్క బాగుందని పలువురు ప్రశంసిస్తున్నారు. బతుకు దెరువు కోసం ఏం చేసినా తప్పులేదని చెబుతున్నారు. గుర్తింపు రాకపోతే ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి పోయిన ప్రతిష్టను మళ్లీ తీసుకొచ్చుకుని ఆఫర్లు ఇంటి తలుపు తట్టేలా చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan : ‘నీ ప్రేమ సల్లగుండ’.. జగన్ కు పవన్ కళ్యాణ్ పంచ్ అదుర్స్