Twitter: సోషల్ మీడియా వచ్చాక, రికార్డ్స్ ను కొలిచే ప్రమాణం కూడా మారిపోయింది. అభిమానులు తమ కిష్టమైన స్టార్లను, వాళ్లు నటిస్తున్న సినిమాల విషయాలను పంచుకుంటూ ఎక్కువగా ట్వీట్లు, పోస్టులు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఆ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్లు, పోస్టులు కూడా రికార్డ్స్ గా మారిపోతున్నాయి.

అలా, ఈ ఏడాదిలో నెటిజన్లు ఎక్కువగా ఏ స్టార్ హీరో గురించి ట్వీట్లు చేశారు అంటే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ఆయన నటించిన ‘మాస్టర్’ సినిమా గురించే ఎక్కువగా ట్వీట్లు చేశారు. ఈ విషయాన్ని తాజాగా ట్విటర్ ఇండియా అధికారికంగా ప్రకటిస్తూ.. ‘మోస్ట్ ట్వీటెట్ యాక్టర్, యాక్ట్రస్, సినిమా ఇన్ సౌత్ ఇండియా’ లిస్ట్ ను వదిలింది.
ఈ లిస్ట్ లో తమిళ హీరో విజయ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్‌బాబు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరి ఈ లిస్ట్ పట్టికను ఒకసారి చూడండి.
Also Read: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టకండి..?
టాప్ టెన్ హీరోలు :
1.విజయ్
2.పవన్‌కల్యాణ్
3.మహేశ్‌బాబు
4.సూర్య
5.తారక్
6.అల్లు అర్జున్
7.రజనీకాంత్
8.రామ్‌చరణ్
9.ధనుష్
10.అజిత్
టాప్ టెన్ హీరోయిన్లు:
1.కీర్తిసురేశ్
2.పూజాహెగ్డే
3.సమంత
4.కాజల్
5.మాళవికా మోహన్
6.రకుల్ ప్రీత్‌సింగ్
7.సాయిపల్లవి
8.తమన్నా
9.అనుష్క
10.అనుపమ పరమేశ్వరన్
టాప్ టెన్ చిత్రాలు:
1.మాస్టర్
2.వలిమై
3.బీస్ట్
4.జైభీమ్
5.వకీల్‌సాబ్
6.ఆర్‌ఆర్‌ఆర్
7.సర్కారువారి పాట
8.పుష్ప
9.డాక్టర్
10.కేజీఎఫ్-2