రాజ్ కుంద్రా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు జైల్లో ఉండగా ఇందులో ఇంకా కొందరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ కేసులో అరెస్టయన సంగతి తెలిసిందే. కోల్ కతా కేంద్రంగా రాకెట్ నిర్వహిస్తున్న నటి, ప్రముఖ మోడల్ నందితా దత్త ను పోలీసులు అరెస్టు చేశారు. నాన్సీ బాబీ పేరుతో పాపులర్ అయిన నందిత దత్త సెమీ అశ్లీల చిత్రాల్లో నటిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాల్లో అవకాశాల పేరుతో పలువురు యువతులను తమ ట్రాప్ లోకి లాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారిని బలవంతంగా రొంపిలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇప్పటకే నందితా దాస్ చేతిలో మోసపోయిన బాధితులు కోల్ కతాలోని న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. నందితాదాస్ ఇప్పటికే మోడల్ గా చేస్తున్నారు. దీంతో పలువురు యువతులను అశ్లీల చిత్రాల రాకెట్ లోకి లాగేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా బ్రేక్ ఇస్తామని చెబుతూ వారితో ఒప్పందం చేసుకుని వారిని బెదిరింపులకు గురిచేయడం వారి నైజం.
నందితా దాస్ చేతిలో మోసపోయిన యువతులు జులై 26న న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వీరి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ తనను నగ్నంగా నటించాలని ఒత్తిడి చేసినట్లు వాపోయింది. ఓ స్టూడియోలో చిత్రీకరణ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. దీంతో అశ్లీల రాకెట్ వెలుగు చూడడం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పోర్న్ రాకెట్ లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో తెలియాల్సి ఉంది.
మధ్యతరగతి, పేద కుటుంబాలను ఆసరాగా చేసుకుని ఆ యువతులను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో అవకాశాల పేరుతో లోబరుచుకుని వారితో అశ్లీల చిత్రాల చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వారు ఎదురు తిరిగితే వారిపై బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. నందితా దత్తాపై కూడా పోలీస్ కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నందితా దాస్ పై 354బి, 354సి, 509, 370, 417, 469 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలు ఎక్కడెక్కడ చిత్రీకరించారు? ఎవరిపై చిత్రీకరించారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రాజ్ కుంద్రా రాకెట్ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత మేరకు ఉన్నాయో అనే వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు. అశ్లీల రాకెట్ కేసులో ముంబై లో అరెస్టయిన రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలీసు కస్టడీలోనే ఉన్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Twist in pornography case nandita das arrested
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com