TV9 Anchor Devi Nagavalli: జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ాటుపోట్లు ఉంటాయి. జీవితమనే ప్రయాణంలో అన్ని పూలదారులు ఉండవు. ముళ్లబాటలు కూడా ఉంటాయి. కష్ట సుఖాలు కావడి కుండలు వంటివి. సమానంగా వస్తాయి పోతాయి. కష్టాలకు కుంగిపోకూడదు. సుఖాలకు పొంగిపోకూడదు. అన్ని వేళల్లో సముద్రం వలే ప్రశాంతంగా ఉండటమే జీవితం. దీనికి ఎవరు మినహాయింపు కాదు. ఆడైనా మగైనా అందరికి కష్టాలు కామనే. ఒడిదుడుకులు సర్వసాధారణమే.
బిగ్ బాస్ -4లో కంటెస్టెంట్ గా వచ్చిన దేవి నాగవల్లి గురించి తెలుసుకుంటే ఆమె జీవితం కూడా కష్టాల కడలిలోనే గడిచింది. రాజమండ్రిలో పెరిగిన ఆమె బీకామ్ వరకు చదువుకుని గ్రాఫిక్ నేర్చుకుని డిజైనర్ గా టీవీ 9 ఛానల్ లో ప్రవేశించింది. అందంగా ఉండటంతో యాంకర్ గా చేయమని అడిగారు. దీంతో ఆమె వ్యాఖ్యాతగా మారి ఆసక్తికర కథనాలు కవర్ చేయడమంటే ఇంట్రస్ట్ ఉండేదని చెప్పింది.
Also Read: Krishna Vamsi Khadgam Movie: ఆ దర్శకుడితో సంగీత బెడ్ రూమ్ సీన్.. కృష్ణవంశీ టార్గెట్ అదేనా ?
ఈ నేపథ్యంలో దేవి నాగవల్లి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు పెళ్లయిందని కానీ విడాకులు తీసుకున్నానని చెప్పింది. ఓ బాబు కూడా ఉన్నాడు. మనిషి సంపాదనతోనే జీవితం ముడిపడి ఉందని అనుకోవద్దు. ఎంత సంపాదించినా సంతృప్తి లేకపోతే అంతే. కష్టాలు వెంటాడతాయి. కన్నీళ్లు తోడుంటాయి. అందమైన పల్లకిగా ఊహించుకుని పెళ్లి చేసుకున్నా అందులో కూడా తీరని వెతలే. చివరికి మిగిలింది అపహాస్యమే.
దేవి నాగవల్లి చెప్పిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఇబ్బందులున్నా పట్టు వదలకుండా సమస్యలపై యుద్ధం చేస్తూనే ఉన్నానని చెప్పడం విశేషం. ఎన్ని తప్పులు చేసినా పెళ్లి అనే తప్పు పెద్దదిగా మారింది దీంతోనే తన జీవితం ఎటు కాకుండా పోయింది. కానీ సమస్యలను ఎదురించి పోరాడాలి కానీ భయంతో వెనుదిరగకూడదు. మహిళలకు ఆధర్శంగా ఉండాలనుకున్నా తన జీవితమే కష్టాలకు ఉదాహరణగా మారడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
బిగ్ బాస్ వేదికగా తన కష్టాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. ఎవరు కూడా మానసిక వేదనతో కుంగిపోకూడదు. తెగించి పోరాడాలి. సమస్యలను సాధించాలి. మనమేంటో నిరూపించుకోవాలి. అందుకోసం మన జీవితం ఉన్నదని తెలుసుకుంటే ఎంతటి సమస్య అయినా ఇట్లే పరిష్కారం అవుతుంది. సోషల్ మీడియాలో దేవి నాగవల్లి అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read:Nagarjuna: ఆయన వల్లే నాగార్జున కొన్ని వేల కోట్లు కూడబెట్టారట.. సంచలన నిజాలు!