Krishna Vamsi Khadgam Movie: ఆ ద‌ర్శ‌కుడితో సంగీత బెడ్ రూమ్ సీన్‌.. కృష్ణ‌వంశీ టార్గెట్ అదేనా ?

Krishna Vamsi Khadgam Movie: టాలీవుడ్ లో ‘క్రియేటివ్ డైరెక్టర్’ అన్న మాటకు మారు పేరు డైరెక్టర్ కృష్ణవంశీ. పాత కథనైనా కొత్తగా చెప్పడంలో డైరెక్టర్ కృష్ణవంశీ మేటి. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన సినిమా ‘ఖడ్గం’. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు దక్కాయి కృష్ణవంశీకి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ సంగీత పాత్ర పై అప్పట్లో చాలా చర్చ జరిగింది. సినిమా […]

Written By: Shiva, Updated On : May 9, 2022 1:18 pm
Follow us on

Krishna Vamsi Khadgam Movie: టాలీవుడ్ లో ‘క్రియేటివ్ డైరెక్టర్’ అన్న మాటకు మారు పేరు డైరెక్టర్ కృష్ణవంశీ. పాత కథనైనా కొత్తగా చెప్పడంలో డైరెక్టర్ కృష్ణవంశీ మేటి. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన సినిమా ‘ఖడ్గం’. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు దక్కాయి కృష్ణవంశీకి.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్ సంగీత పాత్ర పై అప్పట్లో చాలా చర్చ జరిగింది. సినిమా ఛాన్స్ ల కోసం దర్శకుడితో బెడ్ రూమ్ కి వెళ్తుంది. కానీ, సంగీత రవితేజను ప్రేమిస్తోంది. కాకపోతే, సంగీత అమ్మ (పావ‌లా శ్యామ‌ల‌) త‌న కూతురును హీరోయిన్ చేయాల‌ని ఆశ పడుతుంది. ఆ ఆశతో కూతుర్ని ఆ దర్శకుడితో గడపడానికి పంపుతుంది.

Also Read: Nagarjuna: ఆయన వల్లే నాగార్జున కొన్ని వేల కోట్లు కూడబెట్టారట.. సంచలన నిజాలు!

కట్ చేస్తే.. ర‌వితేజ త‌లుపు తోసుకుని లోపలకి వెళ్తాడు. ఆ దర్శకుడితో సంగీతను అలా చూసి విల‌విల్లాడిపోతాడు. ఇక ఆ సెటప్ మొత్తం పూలు పళ్లతో నిండిపోయి ఉంటుంది. ఈ పూలను, పళ్ళను బట్టి.. ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ టార్గెట్ పెట్టుకుని కృష్ణవంశీ ఈ సీన్ తీశాడని బాగా ప్రచారం జరిగింది. ఎందుకంటే.. ఈ సీన్ లో దర్శకుడి పాత్ర పోషించిన నటుడు కూడా అచ్చం ఆ సీనియర్ దర్శకుడి గెటప్ లోనే కనిపిస్తాడు.

Krishna Vamsi

ఆ స్టార్ డైరెక్టర్ గతంలో రమ్యకృష్ణ పట్ల ఇలాగే ప్రవర్తించాడు అని, అందుకే, కృష్ణవంశీ కావాలనే ఆ దర్శకుడిని టార్గెట్ చేస్తూ ఖడ్గం సినిమాలో ఆ సీన్ ను పెట్టాడని తెలుస్తోంది. పైగా ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఈ విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఓ న‌టి స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే తప్పకుండా దర్శక, నిర్మాతల గ‌దుల్లోకి వెళ్ళాల్సిందే అంటూ ఆమె మాట్లాడారు.

కృష్ణవంశీ కెరీర్ లో సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా.. సక్సెస్ ఫుల్ పర్సన్ ఆయన. తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి కథలు రాయడం ఆయనకు షాట్ తో పెట్టిన విద్య. సమకాలీన సమస్యలకు తగిన పరిష్కారం చూపించడం ఆయనకు ఆలోచనతో అబ్బిన నైజం. ‘ఆంధ్రా టాకీస్’ అనే బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ‘సిందూరం’ అంటూ సహజత్వం ఉట్టిపడేలా ఓ సినిమా తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు.

Also Read:Director Dasari Narayana Rao: ఈ తెలుగు దర్శకుడు ‘వంద రాజమౌళి’లకు సమానం !

Recommended Videos:

 

Tags