https://oktelugu.com/

Tumbbad Re Release Collection: మొదటి రిలీజ్ కంటే రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన ‘తుంబద్’..మొదటి వారం ఎంత వసూళ్లు వచ్చాయంటే!

యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఆ స్థాయి క్రేజ్ ఉంది. ఓటీటీ లో అలాంటి క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ ఊహించని రీతిలో వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 07:39 PM IST

    Tumbbad Re Release Collection

    Follow us on

    Tumbbad Re Release Collection: ఈమధ్య కాలం లో రీ రిలీజ్ చిత్రాలు కొత్త సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం మనం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల రీ రిలీజ్ చిత్రాలకు మాత్రమే వసూళ్లు వస్తున్నాయి అనుకుంటే పొరపాటే. డబ్బింగ్ చిత్రాలకు కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. కొన్ని సినిమాలకు అయితే మొదటిసారి విడుదల అయినప్పటి కంటే రీ రిలీజ్ లో ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అవి చిన్న సినిమాలు అవ్వడం మరో విశేషం. ఉదాహరణకి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం మొదటి రీ రిలీజ్ లో కేవలం రెండు కోట్ల రూపాయిల వసూళ్లు మాత్రమే రాబట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిల్చింది. సురేష్ ప్రొడక్షన్స్ లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చెయ్యగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రాన్ని బోర్ కొట్టినప్పుడల్లా ఆడియన్స్ ఓటీటీ లో చూస్తూనే ఉంటారు.

    యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఆ స్థాయి క్రేజ్ ఉంది. ఓటీటీ లో అలాంటి క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ ఊహించని రీతిలో వచ్చింది. ఫుల్ రన్ లో దాదాపుగా ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం లాగానే రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ‘తుంబాద్’ అనే చిత్రం కూడా భారీ స్థాయి వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో అప్పట్లో అనుకున్న స్థాయిలో ఆడలేదు కానీ, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన హారర్ అనుభూతి కలగాలి అనే ఆలోచనతో ఈ చిత్రాన్ని రీసెంట్ గానే గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.

    మొదటి రీ రిలీజ్ లో ఈ చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషల్లో కలిపి కేవలం 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ రీ రిలీజ్ లో కేవలం కేవలం హిందీ వెర్షన్ లోనే మొదటి వారం 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. కేవలం హిందీ లో మాత్రమే కాదు, తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రానికి రీ రిలీజ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మొదటి వారం ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల వసూళ్లు అన్ని భాషలకు కలిపి వచ్చింది. ఇది ఇండియా లోనే ఆల్ టైం టాప్ 2 రికార్డు గా చెప్పుకోవచ్చు. మొదటి స్థానం లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘గిల్లీ’ చిత్రం నిల్చింది. రీ రిలీజ్ లో ఈ చిత్రం ఏకంగా 32 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.