Malliswari Child Artist: ‘మల్లీశ్వరి’ చిత్రంలో బాలనటిగా నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఏ రేంజ్ లో తయారైందో చూస్తే నోరెళ్లబెడుతారు!

డైలాగ్స్ అన్ని ఈ చిత్రంలో సూపర్ గా ఉంటాయి. అయితే 'గ్రీష్మ' ఈ సినిమా తర్వాత అశోక్, అమ్ములు, ఏమో గుర్రం ఎగరవచ్చు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పంచాక్షరి, ప్రస్థానం వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు అమ్మాయి చదువు చెడిపోకుండా ఉండేందుకు సినిమాలని ఆపించేసారు.

Written By: Vicky, Updated On : September 19, 2024 7:31 pm

Malliswari Child Artist

Follow us on

Malliswari Child Artist: మన టాలీవుడ్ లో బాలనటులుగా అలరించిన ఎంతో మంది ఆర్టిస్టులు నేడు సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్టుగా నటించి, పెద్దయ్యాక సినిమాల్లోకి హీరో గా, లేదా హీరోయిన్ గా అడుగుపెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆసక్తి లేక సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉంటుంటారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టు గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన నిల్చిన చిత్రాలలో ఒకటి ‘మల్లీశ్వరి’. సురేష్ ప్రొడక్షన్స్ లో విజయ్ భాస్కర్ దర్శకుడిగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రం అప్పట్లో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాదు, టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీ లో వస్తే మన పనులను ఆపుకొని మరీ చూస్తాము. వెంకటేష్ అద్భుతమైన కామెడీ టైమింగ్ కి త్రివిక్రమ్ డైలాగ్స్ తోడైతే ఇలాంటి అద్భుతాలే జరుగుతుంటాయి.

Malliswari Child Artist(1)

ఈ చిత్రం ద్వారానే కత్రినా కైఫ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె జాతీయ స్థాయిలో ఎలాంటి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. ఇకపోతే ఈ చిత్రం లో సీనియర్ నటుడు నరేష్ వెంకటేష్ కి అన్నయ్య గా నటిస్తాడు. ఆయన కూతురుగా ‘గ్రీష్మ నేత్రిక’ అనే అమ్మాయి నటిస్తుంది. క్యూట్ గా ఈ చిన్నారి మాట్లాడే మాటలు మనకి ఎంత ముద్దుగా అనిపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెంకటేష్ ఆమె కోసం చాకో బార్ తీసుకొస్తే, ‘బార్ అంటే ఇంతలా ఉండాలి’ అని ముద్దులొలికే మాటలతో ఈ చిన్నారి పలికే డైలాగ్స్ అప్పట్లో బాగా పేలింది. అలాగే వెంకటేష్ ఇంకో డైలాగ్ కొడుతూ ‘ఎందుకు రా నా మీద బెంగ..త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను కదా’ అని అనగా, ఈ చిన్నారి దానికి కౌంటర్ ఇస్తూ ‘అదేంటి..నువ్వు ఇక ఇక్కడికి రావని, మనమంతా సంతోషంగా ఉండొచ్చని అమ్మ చెప్పింది’ అని అంటుంది.

ఇలాంటి డైలాగ్స్ అన్ని ఈ చిత్రంలో సూపర్ గా ఉంటాయి. అయితే ‘గ్రీష్మ’ ఈ సినిమా తర్వాత అశోక్, అమ్ములు, ఏమో గుర్రం ఎగరవచ్చు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పంచాక్షరి, ప్రస్థానం వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు అమ్మాయి చదువు చెడిపోకుండా ఉండేందుకు సినిమాలని ఆపించేసారు. అయితే పెద్దయ్యాక అయినా ఈ అమ్మాయి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఆ అమ్మాయికి సినిమాల మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం విదేశాలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.