Trivikram’s share: ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితం అయ్యాడు.ఇక ఇప్పుడు ఆయన సినిమాలతో తన పరిధిని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
Read Also: త్రివిక్రమ్ చేతిలో ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగినవే కావడం విశేషం… ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల్లో హీరోలకు కూడా మంచి గుర్తింపైతే వస్తుంది. మొదట్లో రైటర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన దర్శకుడిగా మారి వరుస సక్సెస్ లను సాధించడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ మొదట్లో చేసిన ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లోనే చేశాడు. ప్రొడ్యూసర్ చినబాబు గారి బ్యానర్ లోనే ఈ సినిమాలన్నీ తెరకెక్కుతుండటం విశేషం…మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ బ్యానర్ లోనికి ఎందుకు సినిమాలు చేస్తున్నాడు అనే డౌట్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆయన మాత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…
ఇక ఇప్పుడు వాళ్ళ పీఆర్ఓ టీం ల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో 40% వాటా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళ అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా తన భార్య అయిన సాయి సౌజన్య వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఉండడం విశేషం…
Read Also: త్రివిక్రమ్ చేతిలో ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ…
ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు రాబోయే సినిమాలన్నీ కూడా వీళ్ళ బ్యానర్ లోనే తెరకెక్కుతున్నాయి అంటూ ఆయన చాలా సందర్భాల్లో స్పష్టంగా తెలియజేశాడు… ఇక హారిక హాసిని బ్యానర్ ప్రొడ్యూసర్ అయిన చినబాబు వాళ్ళ తమ్ముడి కొడుకే సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ…
అందువల్లే ఈ రెండు బ్యానర్లు కూడా ఉమ్మడిగా సినిమాలు చేస్తున్నాయి. కొన్ని సినిమాలను విడివిడిగా కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ బ్యానర్ లో ఏ సినిమా చేయాలన్నా కూడా ముందుగా త్రివిక్రమ్ అందులో కథకు సంబంధించిన మార్పులు చేర్పులను చేస్తూ ఉంటాడు…