https://oktelugu.com/

Trivikram Srinivas: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన త్రివిక్రమ్.. మహేష్ తో ముదిరిన గొడవలు..!

మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ బాబు కి మరోక ఫ్లాప్ సినిమాని ఇచ్చాడు అంటూ పెద్ద ఎత్తున త్రివిక్రమ్ మీద మహేష్ బాబు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక దాంతో త్రివిక్రమ్ ఎక్కడ కూడా ఏ పబ్లిక్ ఫంక్షన్ లో కనిపించడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 17, 2024 / 12:38 PM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas: సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన గుంటురు కారం సినిమా మంచి వసూళ్లను రాబట్టి మహేష్ బాబు కెరియర్ లోనే భారీ హిట్ గా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తుంది.

    ఇక దాంతో పాటుగా అదే రోజు రిలీజ్ అయిన హనుమాన్ సినిమా కూడా మంచి టాక్ ని సంపాదించుకొని మంచి విజయం సాధించడంతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే హనుమాన్ దేవుడికి సంబంధించిన సినిమా కావడంవల్ల భక్తి భావాలు ఉన్నవాళ్లు కూడా ఈ పండుగ రోజు దేవుడి సినిమాలు చూడాలనే ఉద్దేశ్యం తో హనుమాన్ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ముందు త్రివిక్రమ్ చెప్పిన మాటలను ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు కెరియర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అంటూ త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఇప్పుడు భారీ ఎత్తున ట్రోల్స్ అయితే చేస్తున్నారు.

    మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ బాబు కి మరోక ఫ్లాప్ సినిమాని ఇచ్చాడు అంటూ పెద్ద ఎత్తున త్రివిక్రమ్ మీద మహేష్ బాబు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక దాంతో త్రివిక్రమ్ ఎక్కడ కూడా ఏ పబ్లిక్ ఫంక్షన్ లో కనిపించడం లేదు. ఇక దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ అజ్ఞాతం వెళ్ళిపోయాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కి, మహేష్ బాబు కి మధ్య ఈ సినిమా రిజల్ట్ పట్ల చిన్నగా మాట మాట పెరుగుతూ గొడవలు అయినట్టు గా కూడా వార్తలు వస్తున్నాయి. దాంతోనే త్రివిక్రమ్ ఎవ్వరికీ కనిపించడం లేదనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో మరోసారి మహేష్ బాబుకి భారీ ఫ్లాప్ ని ఇచ్చాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

    మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడు లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మరికొందరైతే త్రివిక్రమ్ స్టామినా అయిపోయింది. ఇక అతనితో సినిమాలు చేయడం వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి త్రివిక్రమ్ మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది…