https://oktelugu.com/

Trivikram : సినిమాలకు దూరం అవుతున్న త్రివిక్రమ్.. ఆ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ఎంట్రీ

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల్లో డైలాగులకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

Written By: , Updated On : February 20, 2025 / 04:49 PM IST
Trivikram

Trivikram

Follow us on

Trivikram : మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల్లో డైలాగులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నువ్వే నువ్వే సినిమాతో మొదలైన ఆయన ప్రస్తానం ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూనే ఉంది. ఇండస్ట్రీలో ఆయన సినిమాలు ఓ క్రేజ్ ఉంటుంది. తను సినిమా చేస్తున్నాడంటే షూటింగ్ మొదలైన దగ్గర నుంచే భారీ అంచనాలు ఉంటాయి. తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు ఆయన. అలా త్రివిక్రమ్ తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు తన 22 ఏళ్ల కెరీర్ లో 12 సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించారు. చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ సినిమాకు త్రివిక్రమ్ రచనలపై విమర్శలు వచ్చాయి. కాస్త నెగిటివిటీ ఏర్పడింది. కానీ ఆయన తర్వాత ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఇప్పుడు అంతా వెయిట్ చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా వచ్చి సంవత్సరం దాటి పోయింది. అయినా ఇంత వరకు త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నారనేది క్లారిటీ రాలేదు. ఆ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ పలుమార్లు తెలిపారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తీస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా పట్టాలెక్కిన పాపాన పోలేదు. ప్రస్తుత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 హవా కూడా ముగిసిపోవడంతో అతను కూడా తన నెక్ట్స్ సినిమా కోసం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి అది త్రివిక్రమ్ తోనా లేదంటే తమిళ డైరెక్టర్ అట్లీతోనా అన్నది తెలియాల్సి ఉంది. అట్లీతో అల్లు అర్జున్ కోసం సాలీడ్ కథను ఆల్రెడీ రెడీ చేసి పెట్టారని.. దీంతో ఆయన ప్రాజెక్ట్ మొదట వస్తుందని సమాచారం. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే అసలు త్రివిక్రమ్ సినిమాలకు దూరం కాబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయనకు తోడుగా త్రివిక్రమ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ ప్రయాణంలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కు సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో తాను పాలు పంచుకుంటున్నారు. కొన్ని సార్లు బహిరంగంగా కనిపించపోయినప్పటికీ.. త్రివిక్రమ్ వారంలో సగం రోజులు అమరావతిలో గడుపుతున్నారని తెలుస్తోంది. అలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారట. తాజాగా పవన్ ఫ్యామిలీతో కలిసి తాను కుంభమేళాకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన భారీ ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారని కొందరు చెబుతున్నారు. భారీ ప్రాజెక్టులు కావడంతో కాస్త ఆలస్యం సహజమే అంటున్నారు. బన్నీతో సినిమా కాస్త లేట్ అయినా కన్ఫాం అంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి త్రివిక్రమ్ అని ప్రచారం అవుతున్న.. సినిమాలకు తాను ఇప్పుడే గుడ్ బై చెబుతాడని అనుకోలేం.