Trivikram-Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)… ఆయన గత కొద్ది రోజుల నుంచి తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. మహేష్ బాబు(Mahesh Babu) తో చేసిన ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అప్పటినుంచి ఆయన చాలావరకు డీలాపడిపోయాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh) ని హీరోగా పెట్టి ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని సినిమా యూనిట్ అందిస్తోంది. మరి ఈ క్రమంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్న దర్శకులందరికి పోటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ (Trivikram) ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వెంకటేష్ తో చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ గా ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో రాజశేఖర్ (Rajashekar) ను విలన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ మరొక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అంటు వెంకటేష్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో వర్కౌట్ అవుతుందా..?
అలాగే త్రివిక్రమ్ అభిమానులు సైతం ఈ సినిమాను సక్సెస్ చేసి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా నేపథ్యంలో భారీ సక్సెస్ లను అందుకోవాలని ఆశిస్తున్నాము అంటూ వాళ్లు చెబుతుండడం విశేషం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు…ఇక ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న క్రమంలో ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది…