Trivikram Venkatesh New Movie: ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారనే చెప్పాలి…ఇక దర్శకులు సైతం పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు…
కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు వెంకటేష్ (Venkatesh)… ఫ్యామిలీ సినిమాలతో పాటు, మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని రకాల జానర్స్ లో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతన్ని చాలా గొప్ప స్థానంలో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారిపోతున్నాయి. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthi Vastunnam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాడు. 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి ఈ సినిమా వెంకటేష్ కి భారీ ఇమేజ్ ను తీసుకురావడమే కాకుండా ఆయనకంటూ లో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాలో సైతం ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
గతంలో ఆయన చేసిన ‘గుంటూరు కారం’ (Gunturu karam) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనకబడి పోయాడు. దాంతో అతనికి స్టార్ హీరోలు ఎవలేవరు డేట్స్ ఇవ్వడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియాలో అతనికి అంత మంచి మార్కెట్ లేకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి.
వెంకటేష్ (Venkatesh) తో చేస్తున్న సినిమాతో పాన్ ఇండియాలో సైతం భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి.
మరి ఇక మీదట సాధించబోయే విజయాలు కూడా అతన్ని గొప్ప స్థాయిలో నిలుపుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు చేయబోయే సినిమా ఆయనకి డూ ఆర్ డై సిచువేషన్ ఉందనే చెప్పాలి…