Mahesh Babu: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే రైటర్ డైరెక్టర్ ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. నటుడు మాత్రం దర్శకుడు చెప్పినట్టుగా చేస్తే సరిపోతుంది. నిజానికి ఒక దర్శకుడు నటుడుతో ఎలా చేయించాలి. అనేది తను ముందే మైండ్ లో ఇమజిన్ చేసుకొని ఉండాలి. ప్రతిదీ ఆ నటుడికి ఎక్స్ ప్లెయిన్ చేయాలి. ఎక్కడి నిల్చోవాలి, ఏం మాట్లాడాలి, ఎన్ని కన్నీటి బోట్లను కార్చాలి అనేది కూడా దర్శకుడు డిజైన్ చేసుకొని చెప్తాడు. కానీ ఫైనల్ గా నటుడు మాత్రం స్క్రీన్ పైన నటించి ప్రేక్షకులను మెప్పిస్తు వాళ్ల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాడు.
ఇక మొత్తానికైతే ఒక కథను దర్శకుడు కలగంటే నటుడు తెరమీద నటించి ఆ కథను ప్రేక్షకులకు చేరువ చేస్తాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా థియేటర్ లో పెద్దగా ఆడకపోయిన కూడా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా టివీ లో వస్తే చూసే అభిమానులు లక్షల్లో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన టిఆర్పి రేటింగ్ మాత్రం భారీ స్థాయి లో వస్తు ఉంటుంది. ఇక ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే అతడు సినిమాకి ముందు మహేష్ బాబు చేసిన ఒక్కడు, మురారి లాంటి సినిమాల్లో చాలా పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ బాగా మాట్లాడుతూ కనిపించిన మహేష్ బాబు అతడు సినిమాలో మాత్రం చాలా సెలెక్టెడ్ గా మాట్లాడుతాడు.
ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మహేష్ బాబుకి అంత తక్కువ డైలాగులు ఎందుకు రాశారు అని చాలామంది అభిమానుల మదిలో ఒక ప్రశ్న అయితే మెదులుతు ఉండేది. ఇక ఈ ప్రశ్నకు రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే క్లారిటీ ఇచ్చాడు. అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ సీరియల్ కిల్లర్ కాబట్టి ఆయనకి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం ఉండదు.
తన పని ఏంటో తను చేసుకుంటూ వెళ్లి పోయే రకం, అది కాకపోను తను ఒక నేరం చేసి ఒక వ్యక్తి ప్లేస్ లో ఒక పెద్ద ఫ్యామిలీలోకి చేరాడు. తను చేస్తుంది తప్పో, కరెక్టో ఆయనకు తెలీదు కాబట్టి ఆయన ఆ క్యారెక్టర్ లో ఎక్కువగా మాట్లాడకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఆ క్యారెక్టర్ కి ఎక్కువగా డైలాగ్స్ రాయలేదట…ఇక మొత్తానికైతే ఈ సినిమాలో మహేష్ డైలాగులు ఎక్కువగా చెప్పకపోయిన కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణని పొందిందనే చెప్పాలి…