Trivikram Srinivas Story Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…రైటర్ గా తన సత్తా చాటిన తర్వాత దర్శకుడిగా మారి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ‘గుంటూరు కారం’ సినిమాతో కొంతవరకు డీలా పడ్డాడు. అయినప్పటికి వెంకటేష్ తో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో తమిళంలో ‘సియోల్’ అనే ఒక సినిమా రాబోతుంది. శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది…
ఈ సినిమా కథ త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ రెండు ఒకటే అంటూ వార్తలైతే వస్తున్నాయి… గతంలో త్రివిక్రమ్ కమల్ హాసన్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే అతనికి కథ చెప్పాడు. తనను హీరోగా పెట్టీ చేయాలనుకున్నాడా? లేదంటే ఒక డిఫరెంట్ పాత్రలో అతని చేత నటింపజేయడానికి కథనైతే చెప్పాడా అనే విషయంలో క్లారిటీ లేదు.
కానీ మొత్తానికైతే త్రివిక్రమ్ కమల్ హాసన్ కి కథను వినిపించాడు. ఇక అదే కథతో ఇప్పుడు సినిమాని కమల్ హాసన్ చేస్తుండడం వల్ల త్రివిక్రమ్ కథ నే కాపీ చేశాడా? అనే అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. త్రివిక్రమ్ సైతం ఈ విషయం మీద కోర్టును ఆశ్రయించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మాత్రం అటు త్రివిక్రమ్ గానీ, ఇటు కమల్ హాసన్ గానీ స్పందించాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఈ విషయం మీద ఎవరు ఎలా స్పందిస్తారు అనేది…