Shankar Dhanush New Movie Update: ప్రస్తుతం సౌత్ ఇండియా లో పాన్ ఇండియన్ మూవీస్ ట్రెండ్ ఒక రేంజ్ లో సాగుతోంది. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేదు, ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్నారు. అయితే టెక్నాలజీ అందుబాటు లేని సమయంలోనే డైరెక్టర్ శంకర్(Shankar Shanmugam) పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేసి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను నమోదు చేసాడు. రాజమౌళి లాంటోళ్ళు కూడా శంకర్ విజనరీ ని వడిసిపట్టి తమని తాము డెవలప్ చేసుకున్న వాళ్ళే. అలాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో ఇప్పుడు సినిమాలు చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం శోచనీయం. ‘2.0’ సమయం లోనే శంకర్ లోని సృజనాత్మకత తగ్గింది. స్టోరీ ఎలా ఉన్నా టేకింగ్ లో తన పనితనం చూపడం వల్ల, ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
కానీ ‘ఇండియన్ 2’ నుండే శంకర్ కి కష్టకాలం మొదలైంది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో శంకర్ పని అయిపోయిందని అందరూ బలంగా ఫిక్స్ అయిపోయారు. ఈ చిత్రం తర్వాత ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ‘ఇండియన్ 2’ విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభమైంది. మొదట్లో ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉండేవి. కానీ ‘ఇండియన్ 2’ విడుదల తర్వాత ఆ అంచనాలు ఆవిరి అయిపోయాయి. ఫలితంగా ఆ సినిమాకు విడుదలకు ముందు ఎలాంటి క్రేజ్ ఏర్పడలేదు, విడుదల తర్వాత మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని తెచ్చుకొని రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత శంకర్ కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్టే.
ఇప్పుడు స్టార్ హీరోలు కాదు కదా, కుర్ర హీరోలు కూడా శంకర్ కి అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ప్రస్తుతం ఆయన ‘వేల్పరి’ నవల ని వెండితెర పై తీసుకొని రావాలని చూస్తున్నాడు. ముందుగా అజిత్ తో చెయ్యడానికి ప్రయత్నాలు చేసాడు కానీ కుదర్లేదు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక ఈ చిత్రానికి హీరో ధనుష్ మాత్రమే న్యాయం చేయగలడు అని అతన్ని కలిసి ఈ స్టోరీ ని వినిపించాడు. ఆయన చేయడానికి సిద్దమే కానీ, డేట్స్ ఇవ్వడానికి కొంత సమయం కావాలని అన్నాడట. ఎందుకంటే రాబోయే రెండేళ్ల వరకు ధనుష్ డేట్స్ ఖాళీగా లేవు. ఇప్పుడు శంకర్ ధనుష్ తోనే సినిమా చెయ్యాలంటే రెండేళ్ల వరకు ఆయన డేట్స్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒకప్పుడు శంకర్ తో సినిమా అంటే, ఒప్పుకున్న సినిమాలను కూడా పక్కన పెట్టి డేట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో.