Homeఎంటర్టైన్మెంట్Hey Balwanth First Review: 'హే బలవంత్' మొట్టమొదటి రివ్యూ..టాలీవుడ్ లో ఇలాంటి కాన్సెప్ట్ అసలు...

Hey Balwanth First Review: ‘హే బలవంత్’ మొట్టమొదటి రివ్యూ..టాలీవుడ్ లో ఇలాంటి కాన్సెప్ట్ అసలు ఊహించలేదు!

Hey Balwanth First Review: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని పరితపించే హీరోలలో ఒకరు సుహాస్(Actor Suhas). క్యారెక్టర్ ఆర్టిస్టు గా, కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన, ‘కలర్ ఫోటో’ చిత్రం తో హీరోగా మారి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పటి నుండి సరికొత్త కథలతో మన ముందుకొస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘హే బలవంత్'(Hey Balwanth) అనే చిత్రం తో రేపు మన ముందుకు రాబోతున్నాడు. ముందుగా ఈ సినిమా టైటిల్ ‘హే భగవాన్'(Hey Bhagawan). కానీ సెన్సార్ అయ్యాక , బోర్డు సభ్యులు టైటిల్ మార్చమని సూచించడం తో ‘హే బలవంత్’ గా మార్చాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ నేడు సాయంత్రం ప్రారంభం కానున్నాయి.

అంతకంటే ముందే నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియా మిత్రులకు, సినీ ప్రముఖుల్లోని కొంతమందికి ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో వేశారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమా ఆరంభం నుండి, ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ గా తీయడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని, ఎక్కడా కూడా ఒక్క క్షణం బోర్ కొట్టాడని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో హీరో కి తండ్రి పాత్ర పోషించిన నరేష్, మరోసారి సాలిడ్ రోల్ ని కొట్టేశాడని, ఆయన కామెడీ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని అంటున్నారు. ఇక సుహాస్ సంగతి తెలిసిందే, ఆయన కామెడీ చాలా సెటిల్ గా , డీసెంట్ గా ఉంటుంది. ఈ చిత్రం లో కూడా అలాగే ఉందట. నరేష్, సుహాస్ మరియు హీరోయిన్ శివాని నాగారం మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటుందని సమాచారం.

అయితే ఈ చిత్రం లోని కోర్ పాయింట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కోర్ పాయింట్ ఏంటో ట్రైలర్ లోనే మనమంతా చూశాము. నరేష్ చెప్పుకోలేని వ్యాపారాన్ని చేస్తుంటాడు, దానిని ఆయన కొడుకుగా సుహాస్ కొనసాగిస్తూ ఉంటాడు, మధ్యలో హీరోయిన్ కూడా ఆ వ్యాపారం లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ వ్యాపారం మరేదో కాదు, వ్య***రం. చాలా బోల్డ్ కామెడీ అన్నమాట. దీనిని యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ, మామూలు ఆడియన్స్ ఎంత వరకు తీసుకుంటారో తెలియదు. అందరూ ఈ కాన్సెప్ట్ ని నచ్చితే హిట్ అవ్వొచ్చు, లేదంటే డిజాస్టర్ ఫ్లాప్ అవ్వుధి. మరి ఏమి జరగబోతుంది అనేది కొద్దిగంటల్లోనే తెలియనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version