Trivikram Srinivas: శివ సినిమాతో ఒక్కసారిగా పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… మొదటి సినిమా తోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తదుపరి సినిమాలతో ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఒకానొక సమయంలో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలందరు ఆసక్తి చూపించేవారు. ఇక అలాంటి వర్మ ఆ తర్వాత స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి రైటర్ పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాకి డైలాగులు రాసే అవకాశమైతే త్రివిక్రమ్ కి వచ్చిందట. ఆ సమయంలోనే త్రివిక్రమ్ కలిసినప్పుడు ఆర్జీవి గురూజీకి కథను వినిపించి అందులో డైలాగులు ఎలా ఉండాలి అనేది కూడా తనే డిసైడ్ చేసి చెప్పేవాడట. దాంతో వర్మ చెప్పిన వైలెంట్ డైలాగులను చూసిన త్రివిక్రమ్ కొంతవరకు భయపడ్డారట.
ఇక ఏది ఏమైనా కూడా ఆ కథకి అలాంటి డైలాగులు అంత ఎఫెక్టివ్ గా ఉండవనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్ ఉన్నారట. కానీ వర్మ మాత్రం తనకు ఇష్టం వచ్చినట్టుగా డైలాగులను రాయించుకుంటూ ఉంటాడు కాబట్టి తనకు నచ్చిన కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చి అలాంటి డైలాగులు కావాలని చెప్పడంతో త్రివిక్రమ్ భయపడిపోయి ఆ మూవీ నుంచి తప్పుకున్నారట.
ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఆర్జీవితో వర్క్ చేసే అవకాశం వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పించుకోవడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. నిజానికి త్రివిక్రమ్ తన కెరీర్ మొదట్లో నిన్నే ప్రేమిస్తా,నువ్వే కావాలి, స్వయంవరం, చిరునవ్వుతో లాంటి డీసెంట్ సినిమాలకి వర్క్ చేశాడు. ఇక వర్మ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
కొంచెం బోల్డ్ సీన్స్, అలాగే వైలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో వర్మ తో సినిమా చేయడం కంటే కామ్ గా ఉన్నదే బెటర్ అని త్రివిక్రమ్ అతని నుంచి తప్పించుకొని వచ్చారట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య మాటలైతే లేవని చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు…

