Homeఎంటర్టైన్మెంట్Trivikram Srinivas: త్రివిక్రమ్ ను అవమానించిన రైటర్స్ ఎవరు..?

Trivikram Srinivas: త్రివిక్రమ్ ను అవమానించిన రైటర్స్ ఎవరు..?

Trivikram Srinivas: కెరియర్ స్టార్టింగ్ లో రచయితగా తన సత్తా చాటుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన కథ మాటలు అందిస్తున్నాడంటే చాలు ఆ సినిమాలను జనాలు ఎగబడి చూసేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన స్వయంవరం, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు లాంటి వరుస సినిమాలకు కథ మాటలు అందించి సక్సెస్ లను సాధించాడు. తన కలం నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ప్రేక్షకుడి హృదయాలను హత్తుకునే విధంగా ఉండేవి. అప్పట్లోనే ఆయనకు ఇతర రచయితల కంటే కూడా గొప్ప గుర్తింపైతే వచ్చింది. కానీ అప్పుడున్న రచయితల ద్వయం త్రివిక్రమ్ ను తొక్కేయాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు. ఇక వాళ్ళు త్రివిక్రమ్ ఏం రాస్తున్నాడు అంటూ అతన్ని బహిరంగంగా చాలామంది ముందే అవమానించేవారట. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు వాళ్ళే రైటర్స్ గా వ్యవహరించేవాళ్లు… దాంతో యంగ్ రైటర్ అయిన త్రివిక్రమ్ రాక వల్ల కెరియర్ కి ఇబ్బందిగా మారవచ్చనే ఉద్దేశ్యంతోనే వాళ్లు త్రివిక్రమ్ ను తిక్కేయాలని చూశారంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..

వాళ్ళతో పాటు మరి కొంతమంది సీనియర్ రచయితలు సైతం త్రివిక్రమ్ ను డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసిన కూడా ఆయన టాలెంట్ తో సినిమాలను సక్సెస్ చేస్తూ ముందుకు వచ్చాడు. అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

తన సినిమాల్లో ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఊహించని విధంగా ట్విస్టులు ఉంటాయట. మరి అవన్నీ ప్రేక్షకుడికి ఒక థ్రిల్ ఫిల్ కలిగిస్తాయంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు రావడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియాలో ఒక భారీ సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular