Trivikram Srinivas: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ సినిమా ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్’ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘అందరికీ హాయ్. సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా విషయంలో ముందుగా మీడియాకు ప్రత్యేక థ్యాంక్స్. మేము ఈ సినిమా తీస్తే… మీడియా తమ భుజాల మీద వేసుకుని జనాల వద్దకు తీసుకువెళ్లింది. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పాదాభివందనం చేస్తున్నాను.
Also Read: భీమ్లానాయక్‌ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశారో తెలిస్తే షాక్ అవుతారంతే..!
‘అయ్యప్పనుమ్ కోషియం’ను తెలుగులోకి తెరకెక్కించాలని మొదట నిర్ణయం తీసుకున్నప్పుడు.. మాకు అనిపించిన పెద్ద సమస్య ఏమిటంటే.. డేనియల్ శేఖర్ వైపు నుంచే కథ ఎక్కువగా ఉంటుంది. అందుకే, మేము తెలుగువారికి అనుగుణంగా ‘భీమ్లానాయక్’ వైపు నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాం. కానీ ఎలా చెప్పాలి ? ఇద్దరి పాత్రలను బ్యాలెన్స్‌డ్‌గా ఎలా చూపించాలి ?

అప్పుడు మాకు తట్టిన ఆలోచన ఏమిటంటే.. అడవికి సెల్యూట్ చేయడం నుంచి సినిమాని ప్రారంభించి… ‘భీమ్లానాయక్’ క్యారెక్టర్‌కు దగ్గరగా కథను తీసుకువెళ్తే.. న్యాయం చేయగలమనిపించి.. మేము దాన్నే ఫాలో అయ్యాము. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేశాము. ఇక అభిమానులు ఏం కోరుకుంటారనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నాము.
అందుకే.. సినిమాలో ప్రతి సీన్ సహజంగా ఉండేలా ప్లాన్ చేశాం. గణేశ్ మాస్టర్ స్టెప్పులు బాగా కంపోజ్ చేశారు. సుమారు 600 మందితో సాంగ్ షూట్ చేయడంఅంటే .. అది జస్ట్ సాధారణమైన విషయం కాదు. అయితే, ఆ సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో నేను సెట్ లోకి వెళ్ళాను. వెళ్లగానే నేను అక్కడ అంతమంది జనాన్ని చూసి షాక్ అయి.. వెంటనే అక్కడ నుంచి నేను పారిపోయాను’ అంటూ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Also Read: ‘భీమ్లానాయక్’ కోసం బాలయ్యను వాడుకొని మరీ బ్లేమ్ చేసిన వైసీపీ సర్కార్