Bheemla Nayak Movie Shooting: పవన్ కల్యాణ్ ఒకప్పుడు పూర్తిగా సినిమాల్లోనే ఉన్నారు కాబట్టి సినిమాను అనుకున్న టైమ్‌కు పూర్తి చేయగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అటు రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంటున్నారు కాబట్టి అనుకున్న టైమ్‌కు పూర్తవుతుందనే నమ్మకం లేదు. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. పవన్ చాలా బిజీ అయిపోయారని, అందుకే ఆయన డేట్స్ ఇచ్చిన టైమ్ లోనే మూవీని పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు భీమ్లానాయక్ మూవీ మేకర్స్.

అయితే వరుస సినిమాలను లైన్ లో పెట్టిన పవర్ స్టార్.. అటు భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు సినిమా కంటే ముందుగానే భీమ్లానాయక్‌ను రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. హరిహర వీరమ్లలుకు ఎక్కువ సమయం పడుతోంది. ఆ సినిమా తర్వాత ఒప్పుకున్న భీమ్లానాయక్ పూర్తి కావడం ఇక్కడ విశేషం. హరిహర వీరమల్లుకు విజువల్ ఎఫెక్ట్ కారణంగా ఎక్కువ సమయం పట్టేలా ఉంది.
Also Read: “భీమ్లా నాయక్”కి నేను పిల్లర్ ఐతే, ఆయన సిమెంట్ – థమన్
అందుకే కథ ప్రధానంగా సాగే మూవీలను త్వరగా పూర్తి చేస్తున్నాడు పవన్. ఇక హరి హర వీరమల్లు సినిమా పూర్తయ్యే సరికి మరో ఆర్నెళ్లు అయినా పట్టేలాగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు భీమ్లానాయక్‌కు అసలు పవన్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు, ఎన్ని వర్కింగ్ డేస్ లలో ఈ మూవీని కంప్లీట్ చేశారో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించింది మూవీ టీమ్. ఇందులో భాగంగా ఇంత పెద్ద సినిమాను కేవలం 57 రోజుల్లోనే పూర్తి చేశామని వివరించాడు. ఇక కేవలం మూడు రోజుల్లేనే టైటిల్ సాంగ్‌ను కూడా తీశామని, దాదాపు 600 మంది డాన్సర్లతో దీన్ని చిత్రీకరించినట్టు వివరించాడు త్రివిక్రమ్. అయితే ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద హీరో సినిమాను అంత తక్కువ రోజుల్లే చేయడమేంటని అంతా షాక్ అవుతున్నారు.
Also Read: ‘భీమ్లానాయక్’ కోసం బాలయ్యను వాడుకొని మరీ బ్లేమ్ చేసిన వైసీపీ సర్కార్