Chandrababu Naidu: రాజకీయాల్లో గండర గండుడు అయిన చంద్రబాబు దేశంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 44ఏండ్లు పూర్తయిన సందర్భంగా తన గత విషయాలను ఆయన పంచుకున్నారు. 1978లో తొలిసారి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని తన తొలి విజయానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు.

అయితే తనుకు ఏదైనా సాధించాలనే తపన అప్పటి నుంచే అలవాటు అయిందని, ఇప్పటికీ అలాగే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తాను స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కోసం అప్పటి సీఎం చెన్నారెడ్డి వద్దకు వెళ్తే.. ఇప్పుడే గెలిచావ్ అప్పుడే మంత్రి పదవి కావాలా అంటూ ప్రశ్నించారని, కానీ తాను మంత్రి పదవి తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదన్నారు. అంజయ్య కేబినెట్ లో మంత్రిగా పనిచేసినట్టు గుర్తు చేసుకున్నారు.
Also Read: ‘భీమ్లానాయక్’ కోసం బాలయ్యను వాడుకొని మరీ బ్లేమ్ చేసిన వైసీపీ సర్కార్
అయితే తాను మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్‌ను తొలిసారి కలివానని, అప్పటి నుంచే ఆయనతో సన్నిహిత్యం పెరిగి ఆయనకే అల్లుడిని అయ్యానంటూ చెప్పుకున్నారు. ఇక ఎన్టీఆర్, వాజ్ పేయ్ లాంటి గొప్ప లీడర్లతో పనిచేసే అదృష్టం తనకు దక్కిందంటూ గుర్తు చేసుకున్నారు. అయితే ఒకానొక సమయంలో తాను రాజకీయాలను వదిలేసి వెళ్లాలనుకున్నట్టు చెప్పారు.

రాజకీయాలను పక్కన పెట్టేసి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోనే కొనసాగుతున్నట్టు తెలిపారు. 1983లో తొలిసారి ఓడిపోయన చంద్రబాబు.. 1989 నుండి కుప్పం నుంచే పోటీ చేస్తూ గెలుస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఏడు సార్లు వరుసగా విజయం నమోదు చేశారు. అయితే చంద్రబాబు రాజకీయాలను వదిలేయానుకున్నది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆయన ఓడిపోయిన సమయంలోనే అలా అనుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ఆ ఐపీఎస్ కు కేసీఆర్ ఎందుకు పోస్టింగ్ ఇవ్వడం లేదు.. తెరవెనుక కథేంటి?