Trivikram NTR Movie: ఒకప్పుడు ఇండస్ట్రీలో రైటర్లకు వాల్యూ ఉండేది కాదు. కానీ త్రివిక్రమ్ ఎప్పుడైతే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటినుంచి రచయితలకు గౌరవాన్ని పెంచాడు. ప్రతి ఒక్కరు వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడే రోజులైతే తీసుకొచ్చాడు. నిజానికి తను రాసిన కథ, మాటల వల్లే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. డైరెక్టర్ గొప్పతనం ఏమీ లేదు అనే రేంజ్ లో తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. అందువల్లే రచయితలు అంటే ఎలా ఉంటారు. రైటర్స్ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అనే రోజును తీసుకొచ్చాడు. అందువల్లే త్రివిక్రమ్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది… ఇక ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు వెంకటేష్ తో ఒక కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్… ఈ మూవీ తర్వాత పురాణాలకు సంబంధించిన ఒక ఫిక్షన్ కథతో జూనియర్ ఎన్టీఆర్ తో భారీ ఎత్తున సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన నాగవంశీ నిర్మిస్తూ ఉండడం విశేషం…
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరొక హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఆ హీరో ఎవరు అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.
రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి రిషబ్ శెట్టి కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధలైతే ఉన్నాయి. దానివల్ల తను ఈ సినిమాలో ఉంటే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి చెప్పారట. ఇక త్రివిక్రమ్ సైతం దానికి ఒప్పుకొని రిషబ్ శెట్టి కి కథ చెప్పి అతన్ని ఒప్పించాడట.
త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ సూపర్ సక్సెస్ ని సాధించి ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లందరికి పోటీని ఇవ్వగలుగుతాడా లేదా అనేది…