Pushpa Movie: సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తమ మూవీ యూనిట్ కి గిఫ్ట్ లను ఇస్తుంటారు. ఈ రకంగా ఇవ్వడం ఎక్కువగా కోలీవుడ్ లో చూస్తుంటాం. అజిత్, విజయ్ లాంటి హీరోలు చాలా సార్లు తమ చిత్ర బృందానికి గిఫ్ట్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా తన సినిమా క్రూ మెంబర్స్ కి బంగారపు ఉంగరాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో రింగ్ పది గ్రాముల వరకు ఉంటుందని తెలుస్తోంది. దాదాపు పన్నెండు మందికి బన్నీ ఈ ఉంగరాలను గిఫ్ట్ గా ఇచ్చాడట. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: భిన్నంగా స్పీడ్ పెంచిన మెగాస్టార్ !
‘పుష్ప’ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి ఐటెం సాంగ్ పూర్తి కాలేదు. ఈ మేరకు ఈ చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో అల్లు అర్జున్-సమంతల మీద ఐటెం సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. దీంతో అభిమానుల్లో టెన్షన్ ఉండేది. సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. దీంతో అనుకున్న దానికంటే ముందుగానే ఐటెం సాంగ్ ను కంప్లీట్ చేశారు. అందుకే స్పెషల్ గా గోల్డ్ రింగ్స్ ను గిఫ్ట్ గా ఇచ్చి తన ప్రేమను తెలియజేశాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. బన్నీ – సుక్కు కాంబినేషన్ లో వస్తున్న ఈ యట్రిక్ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: పవన్ భీమ్లానాయక్ లో త్రివిక్రమ్ మార్క్.. ఆయన చేసిన మార్పులివే..