Nagarjuna role in Kuber : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర'(Kubera Movie) ఈ నెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత బాగా గ్యాప్ తీసుకొని డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula) తెరకెక్కించిన చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ పై శేఖర్ కమ్ముల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అంచనాలు భారీ లెవెల్ లో అయితే లేవు కానీ, డీసెంట్ స్థాయిలో మాత్రం ఉన్నాయి. చాలా కాలం నుండి సినిమాలు లేక థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. అలా ఖాళీగా ఉన్న థియేటర్స్ కి ఈ చిత్రం మంచి వ్యాపారం ఇస్తుందనే ఆశతో ఎదురు చూస్తుంది ట్రేడ్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నిర్మాత సునీల్ నారంగ్ రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ లో ఆయన కుబేర గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నాడు. వాస్తవానికి ఈ స్టోరీ ని అనుకున్నప్పుడు నాగార్జున ని సంప్రదించే ముందు ఇద్దరు ముగ్గురు హీరోలను సంప్రదించాలని అనుకున్నారట. ఎవరెవరిని సంప్రదించాలని అనుకున్నారు అంటూ యాంకర్ నిర్మాత సునీల్ ని అడగ్గా, ‘విజయ్ సేతుపతి.. విక్టరీ వెంకటేష్ లను అడుగుదామని అనుకున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ స్క్రిప్ట్ మొత్తం సిద్ధం అయ్యాక శేఖర్ కమ్ముల ఈ పాత్రలో నాగార్జున గారిని తప్ప ఎవరినీ ఊహించుకోలేకపోతున్నాను, ఆయనే ఈ సినిమాకు కావాలి అని అడిగాడట. మరి అంత పట్టుబట్టి నాగార్జున గారే కావాలని అన్నప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఆయన అదే విధంగా డిమాండ్ చేసి ఉంటాడు కదా అని యాంకర్ సునీల్ ని అడగ్గా ,’అలాంటివి మేము బయట చెప్పకూడదు..నో కామెంట్స్’ అంటూ సమాధానం ఇచ్చాడు.
Also Read : ‘కుబేర’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్టుకి ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఈ సినిమా నిడివి దాదాపుగా మూడు గంటల 15 నిమిషాల వరకు ఉంటుందట. ఈమధ్య కాలం లో ఇంత లెంగ్త్ ఉన్న సినిమా రాలేదు. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అట. కానీ సెకండ్ హాఫ్ ఇంకా పనులు ఉండడం తో ఆపి పెట్టారు. ఈ వారం లోనే సెకండ్ హాఫ్ సెన్సార్ కూడా పూర్తి అవుతుందట. ఇంకా ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల కావాల్సి ఉందట. ఈ నెల 13 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఫిలిం నగర్ లో ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా చాలా బాగా వచ్చిందట. ధనుష్ నటన అద్భుతంగా ఉందని, కచ్చితంగా ఆయనకు మరో నేషనల్ అవార్డు ఈ సినిమా ద్వారా వస్తుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.