Trivikram Second Heroines: సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడిగా మారి వరుస సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ డైరెక్టర్లుగా నిలబెట్టాయి. ఆయన మహేష్ బాబు తో చేసిన అతడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఖలేజా, గుంటూరు కారం సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాయి… అలాగే ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలతో సినిమాలు చేసి వాళ్లకు మంచి సక్సెస్ లను అందించాడు…ఇక చివరగా చేసిన గుంటూరుకారం ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కొంతవరకు నిరాశ చెందాడు. ఇక గుంటూరు కారం విషయంలో భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆ మూవీ ఆయన పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆయన సినిమాల్లో రెగ్యూలర్ గా కనిపించే మదర్ ఫాడ్గర్ సెంటిమెంట్, ఎమోషన్స్ ఆ సినిమాలో కూడా కనిపించడంతో ఆ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ ను హీరో గా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.
Also Read: పూరి జగన్నాధ్ – విజయ్ సేతుపతి సినిమాలో పూరి మార్క్ మిస్ అవుతుందా..?
ఈ సినిమా పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్టుగా ప్రకటిస్తూ ఆయన చేస్తున్న సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ సినిమా కామెడీ జానర్ లో తెరకెక్కుతోంది. ఇక కామెడీ అంటే అటు వెంకటేష్ కి కానీ, ఇటు త్రివిక్రమ్ కి గాని చాలా మంచి పట్టు ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల్లో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…
త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ ల మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ హీరోయిన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ లో ఉన్నవాళ్ళని తీసుకుంటాడు. కానీ సెకండ్ హీరోయిన్స్ విషయంలో మాత్రం ఆయన చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వాళ్లని ఎంకరేజ్ చేస్తూ అతని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడు.
దీనివల్ల వాళ్ళ క్రేజ్ పెరగడమే కాకుండా త్రివిక్రమ్ సినిమాల్లో బ్యూటీ అదనంగా ఆడ్ అవుతూ ఉంటుంది. ఇక జల్సా లో పార్వతి మెల్టన్, అత్తారింటికి దారేదిలో ప్రణీత, అజ్ఞాత వాసి లో అను ఇమాన్యుయేల్, అఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ లాంటి వారిని తీసుకున్నాడు… ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంటే మరొక హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది…