https://oktelugu.com/

Pawan Kalyan-Trivikram: పవన్ కళ్యాణ్ కోసం తన కెరియర్ ను రిస్క్ లో పెడుతున్న త్రివిక్రమ్.. మ్యాటరెంటంటే..?

పవన్ కళ్యాణ్ కొన్ని కొత్త సినిమాలు కూడా కమిట్ అవుతున్నాడు. కాబట్టి ఆయన సినిమాల్లో కంటిన్యూ అవుతాడా? లేదా సినిమాలకు బ్రేక్ ఇస్తాడా? అనే విషయం మీద క్లారిటీ లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : February 5, 2024 / 10:00 AM IST
    Follow us on

    Pawan Kalyan-Trivikram: పవన్ కళ్యాణ్ అంటే సగటు ప్రేక్షకుడి లో ఎనలేని అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన సినిమాల కంటే కూడా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు అలాంటివి. ఇక సినిమాల పరంగా కూడా వైవిధ్యమైన నటనని కనబర్చి ఎక్కువ మంది ఫ్యాన్స్ ను సంపాదించుకొని పవర్ స్టార్ అనే ఒక అరుదైన ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.

    ఇక ప్రస్తుతం ఆయన ఇటు సినిమాలు, అటు రాజకీయాలు అంటూ ఒకేసారి రెండింటి మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఏపి లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కొద్ది రోజులు సినిమా షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్ లకి హాజరు కానున్నట్లు గా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడం ఆపేయాలని చూస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సమయం లో పవన్ కళ్యాణ్ కొన్ని కొత్త సినిమాలు కూడా కమిట్ అవుతున్నాడు. కాబట్టి ఆయన సినిమాల్లో కంటిన్యూ అవుతాడా? లేదా సినిమాలకు బ్రేక్ ఇస్తాడా? అనే విషయం మీద క్లారిటీ లేదు.

    ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సినిమాలని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అట్లీ పవన్ కళ్యాణ్ కాంబో ను సెట్ చేసిన త్రివిక్రమ్. ఇప్పుడు మరో దర్శకుడు తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాని అనౌన్స్ చేయనున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఎలక్షన్స్ కి ముగిసే లోపు ఇవన్నీ సెట్ చేసి పకడ్బందీగా ప్లానింగ్ తో పెట్టాలనే ఉద్దేశ్యం తోనే ఆ పని బాధ్యత మొత్తాన్ని త్రివిక్రమ్ తీసుకున్నట్టు గా తెలుస్తుంది.

    ఇక ప్రస్తుతం ఈ పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ తను చేయాల్సిన సినిమాలను కూడా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ కోసం రాత్రి, పగలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయాన్ని పక్కన పెడితే గురూజీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే దానిమీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలన్నిటిని ఫైనల్ చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తన కథ మీద ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా కూర్చోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తన స్నేహితుడు అయిన పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ తన కెరియర్ ను కూడా రిస్క్ లో పెడుతున్నాడు… ఇక ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నిజంగా వీళ్లిద్దరిది గొప్ప ఫ్రెండ్షిప్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.