Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంటాయి. మరి ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపించాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మరోసారి షేక్ చేయాలని చూస్తున్న అల్లు అర్జున్ అట్టి అయితేనే బెటరని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం త్రివిక్రమ్ కి డేట్స్ ఇచ్చే స్టార్ హీరోలు ఎవరూ లేకపోవడం వల్ల ఆయన తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చేయబోతున్నాడనే దానిమీద క్లారిటీ అయితే రావడం లేదు. ఇప్పటికే అల్లు అర్జున్ తో మూడు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి మాత్రం తనకు అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్రమైన మనస్థాపానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా తను చేయబోయే సినిమా ఎవరితో చేయాలి? ఎవరితో చేస్తే భారీ విజయాలు దక్కుతాయి అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి హీరో కూడా రెండు మూడు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. కాబట్టి స్టార్ హీరోలు ఎవరు అతనికి డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. మరి సీనియర్ హీరోల, యంగ్ హీరోల ఆయన సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read : త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ల వల్లే స్టార్ హీరోలుగా మారి వాళ్ళకే హ్యాండ్ ఇచ్చిన హీరోలు…
మొత్తానికైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కు ను చూపించడానికి సిద్ధమవుతున్నాడు. కానీ హీరోలు మాత్రం అతన్ని పెద్దగా పట్టించుకోవడంలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తనకంటూ ఒక ఐడెంటిటి రావాలంటే మరోసారి ఆయన పాన్ ఇండియాలో సాధించాల్సిన భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటికే తెలుగులో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన ఇంతకుముందు చేసిన ‘గుంటూరు కారం’ (Gunturu Karam) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొంతవరకు డీలాపడ్డాడు. కానీ అంతకుముందు చేసిన ‘ అలా వైకుంఠపురం లో’ సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని సాధించాడు.
మొత్తానికైతే ఇక మీదట ఆయన చేయబోయే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు అలాంటి ఒక సబ్జెక్టుతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తను అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : అల్లు అర్జున్ మీద ఆశలు వదిలేసుకున్న త్రివిక్రమ్…నెక్స్ట్ ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడా..?