Unstapable with NBK Pawan Kalyan : అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ ని ఒప్పించింది అతనేనా..?

Unstapable with NBK Pawan Kalyan :  సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా అరుదు..తన సినిమా ప్రొమోషన్స్ కోసం కూడా ఆయన పెద్దగా పట్టించుకోడు.. ఎప్పుడో ఒకసారి నిర్మాతలు బలవంతం చేస్తే వాళ్ళ కోసం ఒకటి రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి..ఇక రియాలిటీ షోస్ కి మరియు టాక్ షోస్ లలో ఆయన పాల్గొంటాడని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు..అసలు అది భవిష్యత్తులో జరగడం కూడా అసాధ్యం అని అందరూ అనుకునేవారు.

కానీ ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసిన ఘనత ఆహా మీడియా ఛానల్ సొంతం..ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ మొదటి సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు రెండవ సీజన్ కూడా అదే రేంజ్ సూపర్ హిట్ గా నిలిచింది..ఈమధ్యనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని గెస్ట్ గా పిలిచి షూటింగ్ పూర్తి చేసిన ఆహా టీం అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా షూటింగ్ చెయ్యబోతున్నారు.

ఈ నెల 27వ తారీఖున పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని షూట్ చెయ్యబోతున్నారు.. ఈ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ తో పాటుగా డైరెక్టర్ క్రిష్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కాబోతున్నారు..అయితే ఈ షో లో పవన్ కళ్యాణ్ ని పాల్గొనేలా ఒప్పించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అట.. పవన్ కళ్యాణ్ కూడా అతను తనతో పాటు వస్తేనే ఈ టాక్ షో లో పాల్గొంటానని చెప్పడంతో ఇద్దరు కలిసి షూటింగ్ కి రాబోతున్నారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలోనే తెలియజేయనున్నారు ఆహా మీడియా టీం..బాలయ్య బాబుతో కలిసి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ఎలాంటి ముచ్చట్లు ఆడబోతున్నారో చూసేందుకు కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది.

Get notified whenever we post something new!

Continue reading

Rakul Preet Singh : ‘సూర్పనక గా రకుల్ ప్రీత్ లుక్ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి..

Rakul Preet Singh : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి...

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా..

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా నిలవడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్థిరమైన ప్రదర్శన చేసి సత్తా చూపించాడు. మైదానంలో పాదరసం లాగా...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచిక (Investment Friendliness Index) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version