Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో ఓ భారీ మార్పు చేస్తున్నారు. మలయాళ వెర్షన్ అయ్యప్పన్ కోషియమ్ లో పవన్ చేస్తోన్న పాత్రలో ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది. అలాగే ఓ దశలో ఏమి చేయలేని నిస్సహాయత కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అయితే, పవర్ స్టార్ పై నిస్సహాయతను అభిమానులు జీర్ణయించుకోలేరు కాబట్టి.. ఇప్పుడు ఆ సన్నివేశాలను పూర్తిగా మార్చాలని డిసైడ్ అయ్యారు.

పవన్ అభిమానుల కోసం పవన్ పై మాస్ హీరోయిజం పెట్టబోతున్నారు. నిజానికి ఇన్నాళ్లు ఫ్యాన్స్, ఈ సినిమాలో పవన్ నటనకు మాత్రమే చాన్స్ ఉందని ఫీల్ అయ్యారు. కానీ ఈ దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా ఈ సినిమా సెకెండ్ హాఫ్ లో పలు కీలక మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాకు మొదటి నుంచి స్క్రిప్ట్, మాటల విషయంలో త్రివిక్రమ్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కూడా క్రియేట్ చేశాడు. ఆ ప్లాష్ బ్యాక్ నిండా అద్భుతమైన ఫైట్స్ ను పెట్టారు. ఒకవిధంగా కేవలం పవన్ ఫ్యాన్స్ కోసమే ఈ ప్లాష్ బ్యాక్ ను రాశారు. కాబట్టి.. పవన్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసమైన రెండు మూడు సార్లు సినిమా చూస్తారేమో. మరోపక్క పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి..
ఈ సినిమాకు హిందీలో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఎప్పటికైనా ఒరిజినల్ ఒరిజినలే కదా. ఏ భాష నుంచి ఏ భాషకు పోయినా ఇదే స్థితి. రీమేక్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడవు. పైగా మలయాళం నుండి తెలుగుకు అనువదించే సినిమాల్లో నేపథ్య సమస్యే కాక ప్రేక్షక అబిరుచి సమస్య కూడా ప్రధానంగా ఉంటుంది.
మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ సినిమాను జనవరి 12, 2021కి రిలీజ్ చేస్తున్నారు. అయితే అనుకున్న డేట్ కే సినిమాని రిలీజ్ చేస్తారా ? లేక మళ్లీ పోస్ట్ ఫోన్ చేస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.