టాలీవుడ్ లో కథల కొరత తీవ్రంగా ఉందన్నది వాస్తవం. ప్రఖ్యాత దర్శకులు ఫలానా జోనర్ లో కథ తీస్తానని ప్రకటించడమే ఆలస్యం అలాంటి కథాంశాలతో దర్శకులు నిర్మాతలు రెడీ అయిపోతారు.
రాజమౌళి ‘బాహుబలి’ లాంటి కళాఖండం తీశాక.. ఇదే జోనర్ లో హిందీలో అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ అనే మూవీ తీసి చేతులు కాల్చుకున్నాడు. బాహుబలి గ్రాండ్ హిట్ కాగా.. అమీర్ ఖాన్ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కథ ఉండగానే సరిపోదు.. దాన్ని నడిపించే కథనం కూడా ఇంపార్టెంట్ అని రాజమౌళి చూపించాడు.
సినిమా సినిమాకు డిఫెరెంట్ గా ట్రై చేసే రాజమౌళి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ తో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల ఇతివృత్తాన్ని సినిమాగా తీస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ ముగిశాక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కేఎల్ నారాయణ నిర్మాణంలో ఓ సినిమా తీయబోతున్నాడు.
అయితే ఇదివరకే ప్రకటించినట్టుగా మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ లేదా కౌబాయ్, ఏజెంట్ పాత్రలో సినిమా చేయడానికి రాజమౌళి కథలు నూరుతున్నాడు.
అయితే రాజమౌళి ఐడియాను కబ్జా చేసిన త్రివిక్రమ్ తాజాగా మహేష్ బాబుతో ఈరోజు సినిమా అనౌన్స్ చేసేశాడు. మహేష్ 28వ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ తీయబోతున్నాడు.
ఎన్టీఆర్ తో మూవీని ప్రకటించి మరీ కథలు నచ్చక వైదొలిగిన ఈ ప్రాజెక్ట్ తో త్రివిక్రమ్ నిరాశగా ఉన్న వేళ.. మహేష్ బాబుతో సినిమా ఓకే అవ్వడం గురూజీకి ఊరటనిచ్చింది. అయితే రాజమౌళి చెప్పిన ఏజెంట్ పాత్రనే త్రివిక్రమ్ డిజైన్ చేశారని.. రాజమౌళి ఐడియాను త్రివిక్రమ్ కబ్జా చేశారని అంటున్నారు.
త్రివిక్రమ్ కనుక మహేష్ తో ఏజెంట్ మూవీ తీస్తే రాజమౌళి కూడా అదే కంటెంట్ తో మరోసినిమా తీయలేడు. సో మళ్లీ కొత్త కథ కోసం వెతకాలి. సో త్రివిక్రమ్ వల్ల ఇప్పుడు రాజమౌళి తన కాన్సెప్ట్ కథను కొత్తగా ట్రై చేయాల్సి వస్తోందని అంటున్నారు.
అయితే కొత్త రకం కథలను తీయడంలో రాజమౌళి దిట్ట. ఆయన టేకింగ్ యే వేరు. కానీ ఫ్యామిలీ, కామెడీ సినిమాలు తీసే త్రివిక్రమ్ వల్ల ఇలాంటి ఏజెంట్ సినిమాను తీయడం సాధ్యమవుతుందా? లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న. మహేష్ లాంటి సూపర్ స్టార్ తో అలాంటి సినిమా చేయాలంటే రాజమౌళి బెస్ట్ అని పలువురు సూచిస్తున్నారు.