Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే… పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన కి సంబంధించిన సినిమా విషయాలు మొత్తాన్ని త్రివిక్రమ్ చూసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలి ఎవరితో సినిమా చేయాలి అనే విషయాలను కూడా త్రివిక్రమ్ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ఇక వీళ్ళు ఇంత మంచి ఫ్రెండ్స్ కావడానికి ముఖ్య కారణం వీళ్ళ మైండ్ సెట్ అనేచెప్పాలి. ఎందుకంటే వీళ్లు ఇద్దరూ కూడా ఓకే టైప్ ఆఫ్ మెంటలిటీ తో ఉంటారు. కాబట్టి కాలమే వాళ్ళని కలిపింది అంటూ చాలామంది చెబుతూ ఉంటారు.
వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు ఇద్దరికీ మంచి పేరును తీసుకువచ్చాయి. త్రివిక్రమ్ కి, పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమంటే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం తను చేయాల్సిన సినిమా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఆయనకి ఒక మంచి హిట్టు పడడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సముద్రఖని డైరెక్షన్ లో వచ్చిన బ్రో సినిమాలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించలేదు.దాంతో డైరెక్టర్ గా సముద్రఖని కి పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి.
ఇప్పుడు సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓ జి సినిమా లో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైందని చాలామంది చెబుతున్నారు. ఇంతకుముందు వచ్చిన బీమ్లా నాయక్ సినిమాలో కూడా త్రివిక్రమ్ దగ్గరుండి మరి అన్ని మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో చేయించారు. అయినప్పటికీ సాగర్ కే చంద్ర కి పెద్దగా పేరైతే రాలేదు.ఈ సినిమా క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు సుజిత్ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇలానే వ్యవహరిస్తున్నాడు.
ఇది చూసిన చాలా మంది జనాలు త్రివిక్రమ్ వైఖరిని తప్పు పడుతున్నారు ఎందుకంటే కథకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం వాళ్ళు చేసుకోగలరు మధ్యలో త్రివిక్రమ్ ఎందుకుగా ఇన్వాల్వ్ అయి ఆ కథను డివియేట్ చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వ్యక్తం ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఓ జీ సినిమాకి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన సమయంలో సుజీత్ కి ఇష్టం లేకుండా త్రివిక్రమ్ ఒకటి రెండు మార్పులు చెప్పినట్టుగా తెలుస్తుంది.
అయితే మార్పులు చేర్పుల విషయంలో సుజిత్ మాత్రం అంత సుముఖంగా లేడు కానీ ఓ జీ సినిమాలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల షూట్ చేసిన ఒక ఎపిసోడ్ ని తీసేసి మళ్లీ దాన్ని మార్చి షూట్ చేయాల్సి వస్తుందని సినిమా టీమ్ తెలియజేస్తుంది. ఇక ఈ రకంగా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల సుజిత్ ఒక రకంగా ప్రెజర్ లో ఉన్నారనే చెప్పాలి. ఇంకా ఇలాంటి సమయంలో ఇది చాలా బాధాకరమైన విషయం అయితే ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద అరిచినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ షూట్ చేసింది తీసివేయడం కరెక్ట్ కాదు అలాంటివి ఏమన్న ఉంటే స్క్రిప్ట్ దశలో పనులను పూర్తి చేసినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన విషయాలు చెప్తే బాగుండేది కానీ ఇప్పుడు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అరిచినట్టుగా ఫిలింనగర్ సర్కిల్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది…
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి కోపం వచ్చినప్పుడు అరుచుకుంటూ ఆ తర్వాత మళ్లీ కలిసిపోతారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళిద్దరికీ మద్దతుగా మాట్లాడుతున్నారు.అందుకే ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ ఎక్కువ గా కనిపించట్లేదనే వార్తలు కూడా వస్తున్నాయి…