Homeఎంటర్టైన్మెంట్బాలీవుడ్ స్టార్ పై కూతురు సంచలన వ్యాఖ్యలు !

బాలీవుడ్ స్టార్ పై కూతురు సంచలన వ్యాఖ్యలు !

Trishala Dutt
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ జీవితంలో జరిగినంత డ్రామా, బహుశా సినిమాలో కూడా జరగదేమో. అందుకేగా ఆయన జీవితాన్నే సినిమాగా తీశారు. రెగ్యులర్ సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఏది ఏమైనా.. సంజయ్ అంటేనే.. ఓ విభిన్నమైన వ్యక్తి. ఆయన జీవితమే ఎందరికో గుణపాఠం. ఇక సంజయ్ అలవాట్లు గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి ఎన్నో రూమర్స్.. మరెన్నో వివాదాలు. ఇవ్వన్నీ ఇప్పుడు కొత్తగా చెప్పుకోడానికి ఏమి లేదు.

Also Read: నటి ఆత్మహత్య కేసులో నేరస్థుడు అతనే !

అయితే తాజాగా సంజయ్ కుమార్తె త్రిషాలా దత్ ఆయన డ్రగ్స్ అలవాట్ల పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. త్రిషాలా దత్ పోస్ట్ చేస్తూ.. ”గతంలో నా తండ్రి డ్రగ్స్‌కు అలవాటు పడ్డా కూడా.. మెల్లగా దానినుంచి ఆయన బయటకొచ్చారు. డ్రగ్స్‌ ను ఉపయోగించకపోయినప్పటికీ ప్రతిరోజూ పోరాడాల్సిన సమస్య వచ్చింది ఆయనకు. తనకు తానుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నానని ఒప్పుకోవడమే కాకుండా, దానినుంచి బయపడటానికి సహాయాన్ని కూడా దైర్యంగా కోరిన గొప్పతనం ఆయనది. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గు పడటం లేదు.నా తండ్రి జీవితం స్ఫూర్తిదాయకం” అంటూ త్రిషాలా పోస్ట్ చేసింది.

Also Read: అప్పటి సీక్రెట్స్: 94 రేప్ లు.. ఆ సీన్స్ ఆయనే బాగా చేయగలడు !

నిజానికి సంజయ్ జీవిత ప్రయాణం ఎప్పుడూ వివాదాస్పదమే. ఆయన గురించి రహస్యాలేమీ లేవు.. అన్ని ఓపెనే. తక్కువ టైంలోనే స్టార్ డమ్ రావడం, ఆ పై డ్రగ్స్‌ కి బానిసగా మారడం, దానికితోడు అఫైర్స్, ఈ లోపు కెరీర్ లో డౌన్ ఫాల్, చివరకు జైలు పాలు కావడం.. ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ గురించి ఎంతైనా చెప్పొచ్చు. అయితే తాజాగా సంజయ్‌ దత్ ‏పై స్వయంగా ఆయన కుమార్తె త్రిషాలా ఇలా సంచనల వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ వర్గాల్లో ఆమె హాట్ టాపిక్ అయింది. ఇక త్రిషాలా గ్లామర్ ను చూస్తుంటే.. ఆమె కూడా హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular