https://oktelugu.com/

Star Heroine: 20 ఇయర్స్ నాట్ అవుట్… ఇప్పటికీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్న స్టార్ హీరోయిన్!

అలాగే వారం రోజుల్లో రూ. 461 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన త్రిష... 'అదిరిపోలా' అంటూ కామెంట్ జోడించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2023 / 02:37 PM IST
    Follow us on

    Star Heroine: రెండు తరాల హీరోయిన్స్ తో నటించిన అరుదైన హీరోయిన్స్ కొందరే ఉంటారు. వారిలో త్రిష ఒకరు. త్రిష పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పటికీ ఆమె ఫేమ్ తగ్గలేదు. ఇంకా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించడం కొసమెరుపు. లియో మూవీలో విజయ్ కి జతకట్టిన త్రిష… లిప్ లాక్ సీన్ చేసింది. ఆమె విజయ్ భార్యగా, ఓ పాపకు తల్లిగా నటించింది. లియో మూవీ వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నిర్మాతలు ప్రకటించారు.

    అలాగే వారం రోజుల్లో రూ. 461 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన త్రిష… ‘అదిరిపోలా’ అంటూ కామెంట్ జోడించింది. లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కింది . దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ సంగీతం అందించాడు.

    లియో మూవీతో త్రిష ఓ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో త్రిష నటించింది. అలాగే ఈ జనరేషన్ స్టార్స్… మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఆమె జతకట్టారు. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. తమిళంతో సమానంగా తెలుగులో ఆమెకు ఫేమ్ దక్కింది.

    ప్రభాస్ కెరీర్లో మొదటి హిట్ గా ఉన్న వర్షం త్రిషకు బ్రేక్ ఇచ్చింది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సైతం ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది. వరుసబెట్టి టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో రెండు చిత్రాలు చేసింది. హీరో రానాతో త్రిష ఎఫైర్ నడిపారనే వాదన ఉంది. హీరో శింబుకి కూడా దగ్గరయ్యారని పుకార్లు వినిపించాయి. వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకున్న త్రిష… ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.