Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఏ పని చేసిన అదొక సంచలనం గా మారుతుంది.ఇక రీసెంట్ గా ఆయన హీరోగా చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా నుంచి వదిలిన గ్లిమ్స్ ప్రేక్షకులందరిలో ఉత్సాహాన్ని నింపితే, పొలిటికల్ గా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి మాత్రం కొంతవరకు చురకలను అంటించిందనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఒక ఇల్లును కూడా తీసుకొని రీసెంట్ గా ఉగాది రోజున పవన్ కళ్యాణ్ ‘ గృహప్రవేశం’ కూడా చేశాడు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీని పెట్టి పొలిటికల్ గా కూడా రాణించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను ఎంకరేజ్ చేయడానికి రీసెంట్ గా చిరంజీవి జనసేన పార్టీకి తన తరఫున కోటి రూపాయల విరాళాన్ని కూడా అందించాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా సెట్ ను సందర్శించాడు.
ఇక అక్కడ పవన్ కళ్యాణ్ కి త్రిష కనిపించి షాక్ ఇచ్చింది. ఇక విశ్వంభర సినిమాలో తను హీరోయిన్ గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కనిపించగానే త్రిష కుర్చీలో నుంచి లేచి నిలబడి తనకి హాయ్ చెబుతూ తను కూర్చోడానికి పక్కన ఒక కుర్చీ ఉంటే తనే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కోసం వేసి తనని కూర్చొమని చెప్పిందంట. ఇక తన రెస్పెక్ట్ ని చూసిన పవన్ కళ్యాణ్ ఒకసారిగా షాక్ అయ్యారంట.
నిజానికి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే అక్కడున్న ప్రొడక్షన్ వాళ్ళతో చెప్పి ఒక చైర్ వేయించి పవన్ కళ్యాణ్ ని కూర్చోమనేవారు. కానీ ఒక హీరోయిన్ అయి ఉండి కూడా తను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తనే స్వయంగా వెళ్లి చైర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కేసి కూర్చోమని మర్యాద గా చెప్పడం అనేది ఆమె గొప్పతనానికి నిదర్శనం అనే చెప్పాలి…ఇక పవన్ కళ్యాణ్ త్రిష కాంబినేషన్ లో తీన్ మార్ అనే సినిమా వచ్చింది…ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయింది…