Trisha: కొందరు ఫేడ్ అవుట్ హీరోయిన్ల వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే.. నో అంటూ సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఆటుపోట్లు ఎదుర్కొని.. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది మాజీ బ్యూటీ త్రిష. పాత సామెత ఒకటి ఉంది. ‘బాగా ఆకలి వేస్తే, సింహం కూడా గడ్డి తింటుంది’ అని, సరిగ్గా ఇప్పుడు త్రిష పరిస్థితి కూడా అలాగే ఉంది.

కరెక్ట్ గా రెండు సంవత్సరాల క్రితం ఓ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ హీరోయిన్ గా నటించండి అని ఆ సినిమా మేకర్స్ వెళ్లి రిక్వెస్ట్ చేస్తే.. నేనా ? గెస్ట్ హీరోయిన్ గానా ? అంటూ హేళన చేసింది త్రిష. పైగా నేను ప్రధాన పాత్రలు తప్ప, మరే ఇతర పాత్రలు చేయను అంటూ ఆ సినిమా నుంచి తప్పుకుంది. పైగా ట్వీట్ కూడా చేసింది ఆ సినిమా నేను చెయ్యట్లేదు అని.
Also Read: Anasuya Bharadwaj: ఎక్కువ డబ్బులిస్తే.. హద్దులు మీరడం ఆమెకు మేకప్ తో పెట్టిన విద్య !
ఆ తర్వాత ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన అంథాదూన్ రీమేక్ లో మొదట తమన్నా పాత్ర కోసం త్రిషనే అడిగారు. అడిగిన వెంటనే.. నో అనేసింది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా..! అందుకే త్రిషలో మార్పు వచ్చింది. ఎలాగూ వయసు కూడా పెరిగింది. మరో మూడేళ్లు దాటితే.. ఇక ఆ తర్వాత ఆ ఐటమ్ సాంగ్స్ కూడా రావు అని త్రిషకి ఫుల్ క్లారిటీ వచ్చింది.

అందుకే మళ్ళీ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో బిజీ కావాలని త్రిష ప్రస్తుతం ఫుల్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఐటమ్ సాంగ్ కు కూడా రెడీ అయింది. రవితేజ హీరోగా నక్కిన త్రినాధ్ రావు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి త్రిష అంగీకరించింది అని తెలుస్తోంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ లో త్రిష చాలా బోల్డ్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్రిష తన మనసు మార్చుకుని ఐటమ్ సాంగ్ లు చేయడానికి కూడా సిద్ధం అయింది. మరి హీరోయిన్ గా మళ్ళీ ఫామ్ లోకి వస్తోందేమో చూడాలి. కానీ.. త్రిష ఫామ్ లోకి వచ్చినా ఆమెకు పెద్దగా కెరీర్ ఇక ఉండకపోవచ్చు.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం ఆశలు.. ఎంత సింపులో తెలుసా?
Recommended Videos:



[…] Madhya Pradesh: మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. లైంగిక చర్యలు శృతిమించుతున్నాయి. దీంతో సమాజంలో వారి మనుగడ ప్రశ్నార్తకంగామారే అవకాశం ఉంది. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా వారికి భయం కలిగించడం లేదు. ఉరిశిక్షలు అమలు అవుతున్నా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు వేధింపులు మొదలు. ఈ నేపథ్యంలో వారు బయటకు రావాలంటే భయమే వేస్తోంది. ఒంటరిగా కనిపిస్తే అంతే సంగతి. మనుషుల్లో పశువులు దాగి ఉన్నట్లుగా వారి చేష్టలుండటం గమనార్హం. మానవ నాగరికత పరిణతి చెందుతున్న క్రమంతో మనుషుల్లో జంతు సంస్కృతి కూడా పెరుగుతోంది. ఎక్కడికైనా తోడు లేకుండా వెళ్లాలంటే ఇబ్బందే. మనిషి కోతి నుంచి పుట్టాడని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటాయి. […]