https://oktelugu.com/

Prabhas – Trisha : ప్రభాస్ కి విలన్ గా త్రిష.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్ వచ్చేసింది!

రీసెంట్ గా త్రిష నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచాయి. పొన్నియన్ సెల్వన్ సిరీస్, లియో చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అలాగే రీసెంట్ గా ఆమె సోనీ లివ్ ఓటీటీ యాప్ కోసం 'బృందా' అనే వెబ్ సిరీస్ చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 20, 2024 / 09:39 PM IST

    Trisha as the villain in the movie 'Spirit' directed by Sandeep Reddy starring Prabhas

    Follow us on

    Prabhas – Trisha : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో ఉన్న పోటీ వాతావరణంలో ఒక హీరోయిన్ కి స్టార్ స్టేటస్ రావడం, ఆ స్టార్ స్టేటస్ ని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం చాలా కష్టం. మనమంతా చూస్తూనే ఉన్నాం, కొత్తగా వస్తున్న హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అనిపించుకుంటున్నారు. కానీ వారంతా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వగానే మాయం అయిపోతున్నారు. అలాంటిది ఒక హీరోయిన్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా రెండు దశాబ్దాలకు పైగా అదే రేంజ్ డిమాండ్ తో కొనసాగడమంటే మాటలు కాదు కదా. త్రిష ఆ క్యాటగిరీ కి చెందిన హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన చిన్నతనం లోనే ఈమె కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేది.

    కానీ ఇప్పుడు 7 నుండి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. తెలుగు లో అల్లు అర్జున్ తో తప్ప మిగిలిన అందరి హీరోలతో సినిమాలు చేసింది. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో కూడా సినిమాలు చేసింది. ఇప్పుడు చిరంజీవి తో మరోసారి ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తుంది. ఇకపోతే త్వరలోనే ఈమె ప్రభాస్ తో నాల్గవ సారి కలిసి నటించబోతుంది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పుడు ప్రభాస్ – సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్’ చిత్రం లో ఛాన్స్ కొట్టేసింది త్రిష. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మాత్రం కాదు, విలన్ గా. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం లో హీరో గా, విలన్ గా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. విలన్ పాత్ర పోషించబోతున్న ప్రభాస్ క్యారక్టర్ కి త్రిష జోడీ గా నటించబోతుంది. ఆమె క్యారక్టర్ కూడా ఇందులో చాలా వియోలెంట్ గా ఉండబోతుందట. ఈ ఏడాది లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనుంది. త్రిష గతంలో ధనుష్ హీరో గా నటించిన ‘ధర్మయోగి’ అనే చిత్రంలో విలన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, త్రిష బెస్ట్ విలన్ క్యాటగిరీ లో ఫిలిం ఫేర్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది.

    రీసెంట్ గా త్రిష నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచాయి. పొన్నియన్ సెల్వన్ సిరీస్, లియో చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అలాగే రీసెంట్ గా ఆమె సోనీ లివ్ ఓటీటీ యాప్ కోసం ‘బృందా’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా త్రిష టైం ప్రస్తుతం పీక్ రేంజ్ లో నడుస్తుంది. కల్కి చిత్రం తో భారీ హిట్ కొట్టి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ప్రభాస్ కి త్రిష జోడీ వేళావిశేషం కారణంగా మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టబోతున్నాడని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు.