https://oktelugu.com/

Dhoom – 4 : ధూమ్ 4’లో ప్రభాస్ – రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వీళ్ళిద్దరూ కలిస్తే సిల్వర్ స్క్రీన్ మీద కూడా కెమిస్ట్రీ చాలా సహజం గా ఉంటుందని, భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు ఇరువురి హీరోల అభిమానులు. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 20, 2024 / 10:01 PM IST

    Prabhas - Ram Charan

    Follow us on

    Dhoom – 4 : మన ఇండియన్ సినిమాలో ధూమ్ సిరీస్ కి యూత్ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ వచ్చిన ధూమ్ చిత్రం అప్పట్లో బాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అంటిని బద్దలు కొట్టి సెన్సేషన్ సృష్టించింది. సిరీస్ లాగా కొనసాగించడానికి అవకాశం ఉండడంతో ధూమ్ 2 చిత్రాన్ని హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ తెరకెక్కించి విడుదల చేసారు. ధూమ్ చిత్రం కంటే రెండింతలు పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. కేవలం హిందీ లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. హృతిక్ రోషన్ కి సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో ధూమ్ 3 చిత్రం చేసారు. ఇందులో అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించాడు.

    ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కేవలం ఇండియా నుండి వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం 2013 వ సంవత్సరం లో విడుదలైంది. ఆ తర్వాత ఈ సిరీస్ నుండి మరో సినిమా రాలేదు. సుమారుగా పదేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇప్పుడు యాష్ రాజ్ ఫిలిమ్స్ ధూమ్ 4 చిత్రాన్ని ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా ఎదిగిన ప్రభాస్, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారని టాక్. వీళ్లిద్దరు ఈ సినిమాలో అన్నదమ్ములు గా కనిపిస్తారట. ఇద్దరు కలిసి దేశంలోనే ఘరానా దొంగతనాలు చెయ్యడం, వీళ్ళను పట్టుకోవడం కోసం అభిషేక్ బచ్చన్ విశ్వ ప్రయత్నాలు చెయ్యడం, ఇలా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ సినిమా గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ‘వార్ 2’ చిత్రం చేస్తున్నాడు.

    2019 వ సంవత్సరం లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన వార్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం పూర్తి అవ్వగానే ‘ధూమ్ 4’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్, రామ్ చరణ్ నిజ జీవితం లో ఎంత స్నేహం గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరినొకరు ‘రా’ అని పిలుచుకునేంత చనువు ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే సిల్వర్ స్క్రీన్ మీద కూడా కెమిస్ట్రీ చాలా సహజం గా ఉంటుందని, భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు ఇరువురి హీరోల అభిమానులు. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.