Tollywood Heroine : ఉద్యోగం వదిలొచ్చిన ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. త్వరలోనే యంగ్ హీరోతో పెళ్లి.. ఎవరో గుర్తుపట్టగలరా?

ఈసారి కొడితే బలంగా కొట్టాలి అనే కసితో 'క' అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Written By: Vicky, Updated On : August 20, 2024 9:24 pm

_Star Heroine

Follow us on

Tollywood Heroine : కొంతమంది సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చితో లక్షల రూపాయిలు వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా వదిలి వచేస్తుంటారు. వెన్నెల కిషోర్, నవీన్ పోలిశెట్టి , కిరణ్ అబ్బవరం వంటి వారు సాఫ్ట్ వేర్ రంగం నుండి ఇండస్ట్రీ కి వచ్చిన వారే. అలా హీరోయిన్స్ లో ఇప్పుడు మీరు చూస్తున్న చిన్నారి పెళ్లికూతురు ఉంది. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ మంచి గుర్తింపు వచ్చిన సినిమాలే చేసింది. కొంతకాలం నుండి ఒక యువ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ కుర్ర హీరోయిన్, ఇప్పుడు అతనితో పెళ్ళికి సిద్ధమైంది. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాలో కూడా ఆమె ప్రియుడే హీరో. ఇన్ని క్లూలు ఇచ్చినా కూడా గుర్తుపట్టలేక పోతున్నారా..?, ఆమె మరెవరో కాదు రహస్య గోరఖ్. కిరణ్ అబ్బవరం మొదటి సినిమా ‘రాజా వారు..రాణి వారు’ అనే సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.

kiran abbavaram

ఇండస్ట్రీ లోకి రాకముందు ఆమె ఒక ప్రముఖ ఎమ్మెన్సీ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ ఉండేది. కానీ సినిమాలంటే మొదటి నుండి మక్కువ ఉన్న ఈమె ఆ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఇది రహస్య ఇంట్లో వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులకు దూరంగానే ఉంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం తో మంచి స్నేహం ఏర్పడింది. తరుచూ వీళ్లిద్దరు బయట కూడా తిరుగుతూ ఉండేవారు. అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ పెరిగి అది ప్రేమగా మారింది. 5 సంవత్సరాల పాటు డేటింగ్ చేసుకొని, ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవడంతో ఈ ఏడాది మార్చి 13 వ తారీఖున నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ‘రాజా వారు..రాణి వారు’, ‘ఆకాశమంత ప్రేమ’, ‘బాయ్స్ ఇన్ స్కూల్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఒక్క పెద్ద హీరో సినిమాలో అవకాశం కోసం ఈమె ఎంతగానో ఎదురు చూస్తుంది. చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయికి, ఒక్క సరైన బ్లాక్ బస్టర్ పడితే పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే రహస్య, తనకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

వీటికి భారీ సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. ఆ ఫోటోల కామెంట్స్ క్రింద అభిమానులు ఎంత అందమైన అమ్మాయిని పడేశావు భయ్యా, అదృష్టవంతుడివి అంటూ కిరణ్ అబ్బవరం ని ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే వరుసగా ఆయనకీ రీసెంట్ గా మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఈసారి కొడితే బలంగా కొట్టాలి అనే కసితో ‘క’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.