Prabhas not Happy with Triptii Dimri : బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్ (Prabhas)… ఈ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో మంచి విజయాలు సాధిస్తుండడంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు అతనితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇంతకుముందు సలార్(Salaar), కల్కి (Kalki) లాంటి రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఈ సంవత్సరం రాజాసాబ్ (Rajasaab) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమాతో ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా చేస్తుందంటూ సందీప్ రెడ్డి అనౌన్స్ చేసినప్పటికి ప్రభాస్ మాత్రం తన పక్కన తృప్తి డిమ్రి సెట్ అవుతుందా? అని సందీప్ రెడ్డి వంగ తో డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : సందీప్ వంగ స్పిరిట్ లో త్రిప్తి డిమ్రి ని తీసుకోవడానికి కారణం అదేనా..?
కానీ సందీప్ మాత్రం త్రిప్తి మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తను చాలా మంచి పర్ఫార్మర్ ఆమె కూడా మన సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పాడట. ఇక ఆయన రాసుకున్న పాత్రకి త్రిప్తి చాలా బాగా సెట్ అవుతుందని సందీప్ చెబుతుండడంతో ప్రభాస్ కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
సందీప్ ని నమ్మి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు అనిమల్ (Animal) సినిమా సమయంలో కూడా రణ్బీర్ కపూర్ (Ranbeer Kapoor) కి చాలా డౌట్లు ఉంటే సందీప్ వాటిని తీర్చాడు. ఆ సినిమాతో మనం సక్సెస్ కుట్టబోతున్నామని చెప్పి మరి సక్సెస్ ను అందించాడు. రన్బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించి పెట్టాడు…
దీనివల్ల ప్రభాస్ కూడా సందీప్ ని బ్లైండ్ గా నమ్మి ముందుకెళ్లడమే బెస్ట్ అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ దెబ్బతో స్పిరిట్ సినిమాలో త్రిప్తి హీరోయిన్గా చేయడానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించి 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొడతాడా? లేదా అనేది…