Homeఎంటర్టైన్మెంట్Trinayani Serial Actress: 16 ఏళ్లకే పెళ్లి ఆపై విడాకులు, భర్త లేడని తెలిసి ఇబ్బంది...

Trinayani Serial Actress: 16 ఏళ్లకే పెళ్లి ఆపై విడాకులు, భర్త లేడని తెలిసి ఇబ్బంది పెట్టారు… త్రినయిని సీరియల్ విలన్ రియల్ లైఫ్ ఇదా!

Trinayani Serial Actress: జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ త్రినయని. ఇందులో విలన్ పాత్రలో మెప్పిస్తున్న తిలోత్తమ అసలు పేరు పవిత్ర జయరామ్. ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్రినయని సీరియల్ లో విలనిజం పండిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మెత్తగా కత్తులు దూసే ఈమె నటనకు అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవిత్ర జయరాం పెళ్లి, పిల్లలు జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ .. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో. కన్నడ కంటే తెలుగులో నాకు ఎక్కువ ఆదరణ లభించింది.

అంతకుముందు చాలా కన్నడ సీరియల్స్ చేశాను కానీ .. త్రినయని సీరియల్ కి వచ్చినంత పేరు రాలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కాగా చిన్న వయసులోనే వివాహం జరిగింది.కనీసం నాకు పెళ్ళైన రోజు కూడా గుర్తులేదు. ఒక బాబు, పాప కూడా ఉన్నారు. బాబుకి 22 ఏళ్ళు .. పాపకి 19 ఏళ్ళు. పెళ్లి ఎప్పుడో అయింది .. ఎప్పుడో పోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను… అని పవిత్ర జయరాం వెల్లడించారు.

నాకు 16 ఏళ్లకే పెళ్లి చేశారు. 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూతురు, కొడుకుని తీసుకొని ఇల్లు వదిలేసి వచ్చేశాను.. ఆ సమయంలో పిల్లల్ని పెంచడం కోసం హౌస్ కీపింగ్, లైబ్రేరియన్ వంటి పనులు కూడా చేశాను. కానీ ఎక్కడికి వెళ్లినా ఒంటరి ఆడది అనే చిన్న చూపు చూసే వారు. చదువు లేకపోవడంతో చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చేది.

సింగల్ అనేసరికి చాలా ఇబ్బంది పెట్టేవారు. కొంతకాలం తర్వాత నా స్నేహితుడి ద్వారా సీరియల్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. అలా మెల్లగా అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటూ తన ఒడిదుడుకుల జర్నీని పవిత్ర జయరామ్ గుర్తు చేసుకుంది. కాగా పవిత్ర జయరామ్ నిన్నే పెళ్లాడతా సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే త్రినయని సీరియల్ పవిత్ర జయరామ్ కి పాపులారిటీ తెచ్చింది. తిలోత్తమ పాత్రలో ఆమె విలనిజం అలరిస్తుంది. పవిత్ర జయరామ్ గతం తెలిశాక, ఆమెపై గౌరవం పెరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular