96 Movie: ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది 96 మూవీ. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. విజయ్ సేతుపతి, త్రిష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. భగ్న ప్రేమికులుగా విజయ్ సేతుపతి, త్రిష తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. 96 మూవీ చాలా సహజంగా, నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. 96 చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకుడు. గోవింద్ వసంత అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.
కాగా హీరో-హీరోయిన్ ల చిన్ననాటి పాత్రలను ఆదిత్య భాస్కర్, గౌరీ జీ కిషన్ చేశారు. ఈ కథకు స్కూల్ డేస్ ఎపిసోడ్స్ ప్రధానం. ఆదిత్య, గౌరీ లకు కూడా మంచి స్క్రీన్ స్పేస్ ఉంటుంది. 96 మూవీ గౌరీకి ఇమేజ్ తెచ్చిపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన గౌరీ ప్రస్తుతం హీరోయిన్ గా మారింది. పలు చిత్రాల్లో ఆమె నటిస్తుంది. కాగా 96లో గౌరీ కి స్నేహితురాలు పాత్ర చేసింది ఒక అమ్మాయి.
ఆ అమ్మాయి పేరు నియతి. ఈ నియతి ఎవరో కాదు… 96 మూవీలో ఓ పాత్ర చేసిన దేవదర్శిని కుమార్తె. ఈమె తండ్రి చేతన్ కూడా నటుడే. దేవదర్శిని, చేతన్ చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో నటులుగా ఉన్నారు. రాణి: ది రియల్ స్టోరీ అనే చిత్రంతో మలయాళంలో నియతి అడుగుపెట్టింది. పయి ఇరుక భయమేన్, విత్తు తలై 1 వంటి చిత్రాల్లో నియని నటించింది.
96 చిత్రంలో అమాయకపు కాలేజ్ స్టూడెంట్ గా నటించిన నియతి ఇప్పుడు హాట్ గా తయారైంది. ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో వచ్చిన మార్పుకు ఆడియన్స్ షాక్ అవుతున్నారు. మరి గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఇవన్నీ తప్పదు మరి. కాగా 96 చిత్రాన్ని తెలుగు ‘జాను’గా రీమేక్ చేశారు. సమంత, శర్వానంద్ జంటగా నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో అంతగా ఆడలేదు.
View this post on Instagram