https://oktelugu.com/

Pawan Kalyan: జనసేన కి సపోర్ట్ చేసే ఆర్టిస్టులను తొక్కయాలని చూస్తున్నారా..? అసలేం జరుగుతోంది..?

కొన్ని సందర్భాల్లో మాత్రం నటుల బిహేవియర్ బాగా లేకపోతే వాళ్ళని తొక్కేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కొంతమందిని తొక్కేయాలనే కుట్ర జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 / 09:21 AM IST

    Artists who support Janasena

    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకుంటారు. కానీ కొంతమంది నటులు మాత్రం డిఫరెంట్ సినిమాలను చేస్తూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను సంపాదించుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో హీరోలకు గాని, దర్శకులకు గాని అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం…

    కొన్ని సందర్భాల్లో మాత్రం నటుల బిహేవియర్ బాగా లేకపోతే వాళ్ళని తొక్కేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కొంతమందిని తొక్కేయాలనే కుట్ర జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అంటే హైపర్ ఆది, జానీ మాస్టర్, నటుడు పృథ్వి..వీళ్ళు ముగ్గురికి ఏ సినిమాల్లో కూడా అవకాశాలు ఇవ్వకూడదనే ఉద్దేశ్యం లో వైసీపీ కి అనుకూలంగా ఉండే కొంతమంది దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్లు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నారు.

    కాబట్టి కొంతమంది సినిమా ప్రొడ్యూసర్స్ వీళ్ళను తొక్కేయాలని చూస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ అండగా ఉంది కాబట్టి వీళ్ళని తొక్కేసే అవకాశం అయితే ఎవరికీ లేదని దీని మీద మరి కొంతమంది చాలా ఘాటుగా రిప్లైలను కూడా ఇస్తున్నారు. ఇక నిజానికి మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరి సినిమాల్లో వీళ్ళు చేసిన ఇండస్ట్రీ లో వాళ్ళు ఈజీగా కొనసాగుతారు అంటూ ఇంకొంత మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇది ఏమైనా కూడా వాటి వేటికి వీళ్ళు భయపడకుండా పవన్ కళ్యాణ్ మీద ఇష్టం తో ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే నిజంగా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ లను తొక్కేస్తారా అనే అనుమానాలు కూడా కొంతమందిలో వస్తున్నాయి…

    ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అండగా వీళ్ళందరూ నిలవడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి. ఇక జగన్ ప్రభుత్వం వీళ్ళ మీద కుట్ర పన్నినప్పటికీ వాళ్ళ పప్పులు ఏమి ఉడకడం లేదనేది మాత్రం వాస్తవం…ఇక జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అయి ప్రస్తుతం సినిమాలు చేస్తున్న హైపర్ ఆది మాత్రం వైసిపి ని దారుణంగా విమర్శిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారో తెలియాల్సి ఉంది…