తెలుగు సినిమాల్లో ట్రైన్ ఫైట్ కి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాల వరకు ట్రైన్ ఫైట్ ఉన్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. 50 ఏళ్ళక్రితం వచ్చిన అదృష్టవంతులు సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం దాకా ట్రైన్ ఫైట్ ఉన్న సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఒక సినిమాలో ట్రైన్ ఫైట్ పెడుతున్నారు.
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ” సిటీమార్ ” చిత్రం లో ఈ ఆక్షన్ సీన్స్ ఉండ బోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ పై ఈ ట్రైన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సపంత్ నంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ ట్రైన్ సన్నివేశాలు పూర్తి యాక్షన్ తో సాగుతాయంట….కాగా ఈ సన్నివేశాలు సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయట…. విశేషం ఏమిటంటే హీరో గోపీచంద్ తో పాటు హీరోయిన్ తమన్నా కూడా ఈ షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ జట్టుకి కోచ్ గా నటిస్తున్నాడు. కాగా తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ జట్టు కి కోచ్ గా నటిస్తోంది. ‘యు టర్న్’లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన ” గౌతమ్ నంద ” చిత్రం పరాజయం అయిన దరిమిలా ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని దర్శకుడు సంపత్ నంది పట్టుదలగా ఉన్నాడు. అందుకోసమే రిస్క్ అయినా ట్రైన్ సీన్స్ తీస్తున్నాడు.
Who dares win the race